తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సింబా'ను చూసి పక్కకు తప్పుకున్న చిట్టీ ! - cinema

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం '2.ఓ'. ఈ సినిమా చైనాలోనూ విడుదలకాబోతోంది. అయితే 'ది లయన్​ కింగ్' సినిమా విడుదలను దృష్టిలో ఉంచుకుని రజనీ చిత్రాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం.

సింబ

By

Published : Jun 26, 2019, 7:36 PM IST

"నా దారి.. రహదారి".. రజనీకాంత్‌ స్టైలిష్‌గా ఈ డైలాగ్‌ చెప్తుంటే థియేటర్‌ మొత్తం అభిమానుల ఈలలతో మోత మోగాల్సిందే. ఇది కేవలం ఓ డైలాగ్‌ మాత్రమే కాదు.. వాస్తవంగా కూడా రజనీ బాక్సాఫీస్‌ బరిలోకి దిగుతున్నాడంటే ఎంతటి పెద్ద హీరో అయినా గౌరవంగా పక్కకు తప్పుకోవాల్సిందే. సూపర్‌స్టార్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ అలాంటిది మరి.

అయితే రజనీ తాజాగా ఓ హాలీవుడ్‌ చిత్రం గురించి బాక్సాఫీస్‌ రేసు నుంచి పక్కకు జరిగారు. అదేంటి ఇప్పుడు ఆయన నుంచి విడుదల కాబోతున్న చిత్రాలేమీ లేవు కదా? అని ఆలోచించకండి. రజనీ - శంకర్‌ల కలయికలో వచ్చిన క్రేజీ మూవీ 'రోబో 2.ఓ' త్వరలోనే చైనాలో విడుదల కాబోతుంది. వాస్తవానికి ఈ సినిమాను జులై 12న డ్రాగన్‌ దేశంలో విడుదల చేయడానికి సన్నాహలు చేశారు.

ఈ చిత్రం వస్తున్న మరో వారం తర్వాత (జులై 19) 'ది లయన్‌ కింగ్‌' కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. '2.ఓ' వసూళ్లపై దాని ప్రభావం పడుతుందేమోననే భయంతో రేసు నుంచి తప్పించారట. త్వరలోనే ఓ కొత్త తేదీని ప్రకటించనున్నట్లు చైనాలో ఆ చిత్ర హక్కులను కొనుగోలు చేసిన ఎచ్‌.వై మీడియా నుంచి సమాచారం అందుతోంది. ఏదేమైనా ఓ హాలీవుడ్‌ సినిమాను చూసి రజనీ చిత్ర విడుదలను వాయిదా వేయడం ఇక్కడి అభిమానులకు కొంత ఆశ్చర్యకరంగానే అనిపిస్తోంది.

ఇవీ చూడండి... నటనే కాదు పాడటం వచ్చంటున్న ప్రియా ప్రకాశ్

ABOUT THE AUTHOR

...view details