తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' టీజర్: సమంత పాత్ర ఏంటి? - సమంత లేటేస్ట్ న్యూస్

సమంత తొలి వెబ్​ సిరీస్​ టీజర్​ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఇందులో సామ్ వేషధారణ వైవిధ్యంగా ఉంది. దీంతో అభిమానుల తెగ చర్చించుకుంటున్నారు.

The Family Man 2 teaser
'ద ఫ్యామిలీ మ్యాన్ 2' టీజర్: సమంత పాత్ర ఏంటి?

By

Published : Jan 13, 2021, 4:20 PM IST

Updated : Jan 13, 2021, 4:29 PM IST

'ధ ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ టీజర్​ ఆసక్తి రేపుతూ అంచనాల్ని పెంచుతోంది. బుధవారం విడుదలైన ఈ టీజర్​ సమంత లుక్​ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె పాత్ర ఏమై ఉంటుందా? అని తెగ ఆలోచించేస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన రోల్స్​ చేసిన సామ్​ నటిస్తున్న తొలి వెబ్ సిరీస్​ ఇదే.

మనోజ్‌ భాజ్‌పేయీ, ప్రియమణి జంటగా నటిస్తున్నారు. 'శ్రీ ఎక్కడ ఉన్నావ్‌? నా ఫోన్‌ ఎందుకు లిఫ్ట్‌ చేయడం లేదు' అంటూ ప్రియమణి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

సామ్‌ గెటప్‌ చాలా విభిన్నంగా ఉండడం వల్ల ఇందులో ఆమె ఉగ్రవాదిలా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19న ట్రైలర్, ఫిబ్రవరి 12న వెబ్​ సిరీస్​ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 13, 2021, 4:29 PM IST

ABOUT THE AUTHOR

...view details