తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'జీవితాంతం గుర్తుండిపోయే నవ్వుల్ని పంచారు' - జగదీప్​ మృతిపై బాలీవుడ్ ప్రముఖుల స్పందన

బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్​ మరణంపై సంతాపం తెలిపిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు.. తమకు జీవితాంతం గుర్తుండిపోయే నవ్వుల్ని అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

'జీవితాంతం గుర్తుండిపోయే నవ్వుల్ని పంచారు'
జగదీప్​ మృతి బాలీవుడ్ రియాక్షన్

By

Published : Jul 9, 2020, 3:38 PM IST

బాలీవుడ్​ ప్రముఖ హాస్యనటుడు జగదీప్(81) బుధవారం రాత్రి మృతి చెందారు. ఈ విషయమై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ట్విట్టర్​ వేదికగా ఆయనతో ఉన్న జ్ఞాపకాల్ని పంచుకుంటున్నారు. తమ జీవితాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే నవ్వుల్ని నింపిన జగదీప్​కు ధన్యావాదాలు తెలిపారు.

భారత్​లోని అత్యుత్తమ నటుల్లో జగదీప్​ ఒకరని చెప్పిన అనిల్ కపూర్.. ఆయనతో నటించడం తనకు దక్కిన అదృష్టమని అన్నారు.

జగదీప్​ మరణంపై సంతాపం తెలిపిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్.. గతంలో తామిద్దరి మధ్య జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. ప్రేక్షకుల్ని నవ్వించడం చాలా కష్టంతో కూడుకున్నది అనే విషయం గురించి అప్పుడు మాట్లాడుకున్నామని ట్విట్టర్​లో రాసుకొచ్చారు.

ఇదే విషయం ట్వీట్ చేసిన నటుడు రితేశ్ దేశ్​ముఖ్.. తమ జీవితకాలం గుర్తుండిపోయే నవ్వుల్ని నింపినందుకు జగదీప్​కు ధన్యవాదాలు చెప్పారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

వీళ్లతో పాటే నటీనటులు అభిషేక్ బచ్చన్, శిల్పాశెట్టి, జెనిలీయా దేశ్​ముఖ్, శత్రఘ్ని సిన్హా తదితరులు ట్విట్టర్​ వేదికగా జగదీప్​కు సంతాపం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details