thaman music for radheshyam: వరుస సినిమాలతో సంగీత దర్శకుడు తమన్ మంచి జోరు మీద ఉన్నారు. అఖండ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించడంలో తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఎంతో కీలకంగా నిలిచింది. ఇదే జోరుతో రాధేశ్యామ్ చిత్రాన్ని కూడా ఒప్పుకొన్నారు.
అయితే రాధేశ్యామ్ చిత్రాన్ని తాను ఓ సవాలుగా స్వీకరించినట్లు చెప్పుకొచ్చారు తమన్. కేవలం మాస్ సినిమాలకు మాత్రమే గాక రొమాంటిక్ డ్రామాలకు కూడా బీజీఎం కంపోజ్ చేయగలనని అందరికీ నిరూపించాలనుకుంటున్నట్లు తెలిపారు. అందుకే ఈ చిత్రాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు పేర్కొన్నారు.