కేసు గెలిస్తే యాభై శాతం డబ్బులు వెనక్కి... ఓడిపోతే వంద శాతం డబ్బులు తీసుకోండి... కానీ కేసులు మాత్రం ఇవ్వండని అడుగుతున్నాడు హీరో సందీప్ కిషన్. మరి కేసులు ఇస్తే గెలుస్తాడో లేదో తెలియదు కానీ 'తెనాలి రామకృష్ణ' సినిమాకు వెళ్తే మాత్రం వంద శాతం హాస్యం పంచుతానంటున్నాడు. శనివారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు.
'పేద ప్రజలకు ఇళ్లు పట్టాలు ఫ్రీగా ఇచ్చినట్టు.. దీనికి ఎవరో లాయర్ పట్టా ఫ్రీగా ఇచ్చినట్టున్నారు', 'డ్రైవింగ్ రానోడికి బండి.. వాదించడం రానోడికి కేసు ఇవ్వడం కరెక్ట్ కాదయ్యా', 'సివిల్ కేసులను కాంప్రమైజ్ చేయొచ్చు కానీ క్రిమినల్ కేసులను కావు' వంటి డైలాగ్లు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.