తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇంతకీ 'సామజవరగమన' అంటే ఏంటో తెలుసా?

ప్రస్తుతం సోషల్​ మీడియాలో ట్రెండింగ్​లో ఉన్న పాట 'సామజవరగమన'. అయితే ఈ పదానికున్న అర్ధం తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయండి.

ఇంతకీ 'సామజవరగమన' అంటే ఏంటంటే?
సామజవరగమన అంటే అర్ధం ఏంటో తెలుసా?

By

Published : Jan 1, 2020, 8:00 AM IST

'సామజవరగమన' పాట... అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా గత కొంత కాలంగా సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ఈ పదానికి అర్థం తెలియకపోయినా.. పాడుకోవడానికి క్లాసీగా, బోలెడంత క్యాచీగా ఉండటం వల్ల ఈ గీతాన్ని తెగ పాడేస్తున్నారు. అయితే సామజవరగమన అంటే అర్ధం ఏంటో తెలుసా?

'సామజవరగమన' అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది. ఏనుగు వంటి గంభీరమైన నడక గలవాడా అంటూ శ్రీకృష్ణుణ్ని కీర్తించే కీర్తన అది. ప్రముఖ రచయిత వేటూరి.. తనదైన శైలిలో ఈ పదాన్ని, వేరే పదాలతో మిక్స్​ చేసి.. కె.విశ్వనాథ్ 'శంకరాభరణం' కోసం తొలిసారిగా ఉపయోగించారు.

అలాంటి అందమైన 'సామజవరగమన' పదాన్ని ఆ తర్వాత ఇంకో రెండు పాటల్లోనూ వినియోగించారు. వంశీ దర్శకత్వం వహించిన 'లాయర్ సుహాసిని', బాలకృష్ణ 'టాప్ హీరో' సినిమాల కోసం ఆ పదాన్ని ఉపయోగించారు. అవి ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు 'అల వైకుంఠపురములో' సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి.. ఈ పదాన్ని నాలుగోసారి రాయడం వల్ల మరోసారి ట్రెండింగ్​లో నిలిచింది. అదండీ 'సామజవరగమన' పదం వెనక ఉన్న కథ.

ABOUT THE AUTHOR

...view details