తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'హీరో అంటే కథానాయకుడు మాత్రమే కాదు' - bollywood

ప్రేక్షకులు అన్ని చిత్రాల్ని ఒకేలా ఆదరిస్తున్నారని చెప్పిన హీరోయిన్​ తాప్సీ.. హీరో అంటే కథానాయకుడు మాత్రమే అనే ఆలోచన మారాలని అంటోంది. ప్రస్తుతమున్న  హీరోయిన్లందరూ ఈ విషయంపై ఏకం కావాలని చెప్పింది.

తాప్సి

By

Published : Jul 25, 2019, 5:30 AM IST

సినీ ఇండస్ట్రీలో హీరో అనే పదంపై ఆలోచన మారాలని అంటోంది హీరోయిన్​ తాప్సీ. నెమ్మదిగా ఈ మార్పు తెచ్చేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని చెప్పింది. ప్రేక్షకులు ప్రస్తుతం మిగతా సినిమాల్లానే కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలను చూస్తున్నారని చెప్పిందీ భామ. విజయాలు సాధించటంలో వీటిలో వ్యత్యాసం లేదని అంటోంది.

"హీరో అనే పదానికి లింగబేధం లేదు. నేనే ఆ విషయాన్ని నిరూపించాలని అనుకుంటున్నా. ఏ ఒక్క రాత్రిలో ఈ మార్పు తీసుకురాలేం. ప్రేక్షకుల ఆలోచనల్లో నెమ్మదిగా ఈ మార్పు తేవాలి. దీనిపై ప్రస్తుత కథానాయికలందరూ ఏకం కావాలి" -తాప్సీ పన్ను, హీరోయిన్

తాప్సీ ప్రధాన పాత్ర పోషించిన 'గేమ్​ ఓవర్' ఇటీవలే విడుదలైంది. ఈ​ చిత్రాన్నే తన మాటలకు ఉదాహరణగా చూపింది.

"ఈ సినిమా కమర్షియల్​గా హిట్​ అయితే భవిష్యత్తులో ఇలాంటి చిత్రాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకొస్తారు" -తాప్సీ పన్ను, హీరోయిన్

ఈ ఏడాది తాప్సీ నటించిన హీరోయిన్​ ఓరియెంటడ్​ చిత్రాలు 'బద్లా'(రూ.100 కోట్లు), 'గేమ్ ఓవర్'(రూ.17 కోట్లు) ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

"ప్రస్తుతం మన ఆలోచన ధోరణి మారుతోంది. అన్ని రకాల సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. గేమ్ ఓవర్​ అన్ని చిత్రాల్లాంటిది కాదు. మాములు సినిమాల్లో ఉండే పాటలు, హాస్యం తదితర అంశాలు లేవు. సినిమాలు ఎంచుకునే విధానంలో నేను ఆలోచన మార్చుకోను. నేను నటించే చిత్రాల్ని ఆదరించే ప్రేక్షకులు కొంతమంది ఉన్నారు. భవిష్యత్తులో వారు ఇంకా పెరగొచ్చు." -తాప్సీ పన్ను, హీరోయిన్

అక్షయ్ కుమార్ నటిస్తన్న 'మిషన్ మంగళ్'లో శాస్త్రవేత్తగా కనిపించనుంది తాప్సీ. ఆగస్టు 15 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సాంద్ కీ ఆంఖ్' సినిమాలో వృద్ధ షూటర్​గా కనిపించనుంది. దీపావళికి థియేటర్లలోకి రానుంది.

ఇది చదవండి: కియరా అడ్వాణీకి ఆ పేరెలా వచ్చిందంటే..!

ABOUT THE AUTHOR

...view details