ఈ దశాబ్ద కాలంలో వచ్చిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి'.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తెలుగులో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ వంగా... ఇదే సినిమాను హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రూపొందించాడు. అక్కడ దాదాపు రూ.300 కోట్లు వసూళ్లు సాధించింది. ఇప్పుడు 'ఆదిత్య వర్మ' వంతు వచ్చేసింది. విక్రమ్ తనయుడు ధ్రువ్ తొలిసారి హీరోగా నటించాడీ సినిమాలో. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్' లాగా 'ఆదిత్య వర్మ'.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఇటీవలే విడుదలైన ఈ చిత్రం.. తమిళనాట కాసుల వర్షం కురిపిస్తోంది. సినిమాకు వస్తున్న స్పందనపై సంతోషం వ్యక్తం చేస్తూ దర్శకనిర్మాతలు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. కథానాయకుడు విక్రమ్ తన తనయుడికి తొలి సినిమాతోనే విజయం దక్కటం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు.
"తండ్రిగా దీనికి మించిన ఆనందం మరొకటి లేదు. 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్‌కు మనసారా కృతజ్ఞతలు".