తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫ్యామిలీ మ్యాన్'​ ట్రైలర్​పై వ్యతిరేకత.. ఎందుకంటే? - ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్​పై తమిళుల ఆగ్రహం

సమంత కీలకపాత్రలో నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' రెండో సీజన్​ ట్రైలర్ తాజాగా విడుదలైంది. అయితే ఇది తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని తమిళులు మండిపడుతున్నారు.

Family Man season 2
ఫ్యామిలీ మ్యాన్​

By

Published : May 21, 2021, 10:38 AM IST

దర్శకద్వయం రాజ్, డీకే తెరకెక్కించిన ది 'ఫ్యామిలీ మ్యాన్' మొదటి సీజన్​ ఆకట్టుకోవడం వల్ల రెండో సీజన్​ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో సమంత కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ రెండో సీజన్ ట్రైలర్​ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అయితే కొందరు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ అభిమానులు చిత్రబృందంపై మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో 'ఫ్యామిలీ మ్యాన్ ఎగేనెస్ట్ తమిళ్' అనే హ్యాష్​ట్యాగ్​తో ట్విట్టర్​లో పోస్ట్​లు పెడుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ ట్రైలర్​లో తమిళుల కోసం పోరాడిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం అనే సంస్థకి ఉగ్రవాదులతో లింకు పెట్టడం తమిళులకు ఆగ్రహం తెప్పిస్తోంది. అసలు లిబరేషన్ ఆర్మీ టెర్రిరిస్ట్ సంస్థే కాదని అంటున్నారు. సమంత పోషించిన పాత్రపైనా విమర్శలు గుప్పిస్తున్నారు.

జూన్ 4న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. ట్రైలర్​తోనే ఇన్ని విమర్శలు ఎదుర్కొన్న ఈ సిరీస్​.. విడుదలయ్యాక ఎన్ని వివాదాలు రేకెత్తిస్తుందో అని అనుకుంటున్నారు అభిమానులు.

ABOUT THE AUTHOR

...view details