తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్ కేసు: మరొకరిని అరెస్ట్ చేసిన ఎన్​సీబీ - సుశాంత్ ఆత్మహత్య

సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసులో ఎన్​సీబీ మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో కరన్​జీత్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

సుశాంత్ కేసు
సుశాంత్ కేసు

By

Published : Sep 12, 2020, 9:46 PM IST

సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో మాదకద్రవ్యాల నియంత్రణ మండలి (ఎన్​సీబీ) మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. కరన్‌జీత్‌ అలియాస్‌ కేజే అనే ఈ వ్యక్తిని ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

తమ దర్యాప్తులో భాగంగా బయటపడిన మత్తుమందుల ముఠాలో కరన్‌జీత్‌ సభ్యుడని ఎన్​సీబీ అధికారులు వెల్లడించారు. అయితే అతడి వద్ద అరెస్టు సమయంలో నిషేధిత పదార్థాలు లభించిందీ, లేనిదీ వెల్లడించలేదు. ఆతడిని దక్షిణ ముంబయిలోని తమ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కరన్​జీత్

తాజా అరెస్ట్‌తో కలిపి సుశాంత్‌ మృతికి సంబంధించి అరెస్టుల సంఖ్య 11కు చేరుకుంది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి, సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా, సహాయకుడు దీపేష్‌ సావంత్‌తో పాటు, డ్రగ్స్‌ విక్రయంతో సంబంధమున్న జాయేద్‌ విలాట్రా, అబ్దెల్‌ బాసిత్‌ పరిహార్‌, కైజన్‌ ఎబ్రహీం, కర్ణా అరోరా, అబ్బాస్‌ లఖానీ, అనుజ్‌ కేశ్వీనీ అరెస్టయిన వారిలో ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details