తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బెచారా' విడుదల ఖరారు - సుశాంత్ చివరి చిత్రం 'దిల్ బెచారా' విడుదల ఖరారు

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ నటించిన చివరి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఆత్మహత్య చేసుకుని అభిమానుల్ని శోకసంద్రంలో ముంచిన ఈ హీరో నటించిన 'దిల్​ బెచారా' జులై 24న విడుదల కానుంది.

Dil Bechara to release digitally on THIS date
సుశాంత్

By

Published : Jun 25, 2020, 4:07 PM IST

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ అకాల మరణం అభిమానుల్ని ఆవేదనకు గురిచేసింది. ఎంతో కెరీర్​ను ముందరుంచుకుని ఆత్మహత్య చేసుకోవడం పట్ల సినీ ప్రియులు విచారం వ్యక్తం చేశారు. ఈ సమయంలో అతడు నటించిన సినిమాలను గుర్తు చేసుకున్నారు. సుశాంత్ చివరి చిత్రం ఇంకా విడుదల కాలేదు. ఫలితంగా ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీనిపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది.

సుశాంత్ చివరగా నటించిన 'దిల్​ బెచారా' చిత్రాన్ని వచ్చే నెల (జులై) 24న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. లాక్​డౌన్ కారణంగా థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడం వల్ల ఓటీటీ ప్లాట్​ఫాంలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. డిస్నీ హాట్​స్టార్​లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుందని హీరోయిన్ సంజనా సంఘి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details