తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుశాంత్ 'దిల్​ బెచారా'.. ఆ ఘనత సాధించిన తొలి సినిమా - Dil Bechara Sushant Singh Rajput

'దిల్ బెచారా' అరుదైన ఘనత సాధించింది. ఏ చిత్రానికి సాధ్యమవని విధంగా ఐఎమ్​డీబీ రేటింగ్ దక్కించుకుంది. ఈ సినిమాను ఎవరైనా సరే, డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో ప్రస్తుతం ఉచితంగా చూడొచ్చు.

సుశాంత్ 'దిల్​ బెచారా'.. ఆ రికార్డు సాధించిన తొలి సినిమా
సుశాంత్ సింగ్ దిల్​ బెచారా

By

Published : Jul 25, 2020, 9:51 AM IST

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ చివరి సినిమా 'దిల్​ బెచారా'.. అభిమానుల నుంచి విశేషాదరణ పొందుతోంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే, ఏ చిత్రానికి సాధ్యం కాని రీతిలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఐఎమ్​డీబీలో తొలుత 10/10 మార్క్​ను అందుకుంది. ప్రస్తుతం 9.8 రేటింగ్​తో ఉంది. దీనితో పాటే 'టాప్ రేటెడ్ ఇండియన్ మూవీస్' జాబితాలో తొలి స్థానం చేజిక్కుంచుకుంది.

సుశాంత్ 'దిల్​ బెచారా' సినిమా ఐఎమ్​డీబీ రేటింగ్

జున్ 14న తన సొంత ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. అతడు నటించిన చివరి చిత్రం 'దిల్ బెచారా'​ను థియేటర్లలోనే విడుదల చేయాలని అభిమానులు కోరారు. కానీ కరోనా వల్ల ఓటీటీలో తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

'దిల్​ బెచారా' సినిమాలో సుశాంత్, సంజన

సినిమా కథ ఇదే

'దిల్​ బెచారా'లో సుశాంత్, సంజనా సంఘీ జంటగా నటించారు. 2014లో వచ్చిన హాలీవుడ్‌ రొమాంటిక్‌ డ్రామా 'ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌'కు రీమేక్‌ ఇది. ఇద్దరు క్యాన్సర్‌ పేషెంట్ల మధ్య సాగే ప్రేమ కథతో సినిమాను రూపొందించారు. సైఫ్‌ అలీ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించారు. ముకేశ్ చబ్రా దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో జులై 24 రాత్రి 7:30 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details