తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్తులన్నింటినీ అమ్మాలనుకున్న సుశాంత్​!

బాలీవుడ్ నటుడు సుశాంత్​ సింగ్​ మృతిపై సీబీఐ విచారణ కొనసాగుతున్న వేళ.. ఓ ఆసక్తికరమైన ఆడియో నెట్టింట వైరల్​గా మారింది. ఇందులో సుశాంత్​ తన భవిష్యత్​ భద్రత మేరకు ఆస్తులన్నీ అమ్మేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తన న్యాయవాదితో పాటు ప్రియురాలు రియాతో కలిసి చర్చించాడు సుశాంత్.

Sushant Singh
ఆడియో వైరల్

By

Published : Aug 31, 2020, 1:33 PM IST

బాలీవుడ్ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ కేసుకు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. ఆర్థిక పరిస్థితులపై ప్రియురాలు రియా చక్రవర్తితో పాటు అతడి సీఏ, న్యాయవాదితో కలిసి చర్చించిన ఓ ఆడియో టేప్​ ప్రస్తుతం వైరల్​గా మారింది. ఇందులో తన భవిష్యత్తు భద్రత కోసం అవసరమైతే మసెరటి కారు, ఇతర ఆస్తులను అమ్మేందుకు వెనకాడబోనని సుశాంత్​ పేర్కొన్నాడు.

సుమారు 35 నిమిషాల నిడివి గల ఆడియో టేప్​లో.. సుశాంత్​ రియా అనేక విషయాలపై చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే తన నటనా వృత్తిని వదులుకుని.. ఏకాంతంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు రాజ్​పుత్​ తెలిపాడు. ఈ ఆడియో జనవరి నాటిదని తెలుస్తోంది. "ఇది నా ఆర్థిక లాభాల కోసం కాదు. కానీ ఒకరకంగా ఆలోచిస్తే.. నా పని మీద రోజుకో విధంగా ఆలోచిస్తుంటా. కాబట్టి, నేను ఇంకొకరి సమయాన్ని వృథా చేయాలనుకోవడం లేదు" అని సుశాంత్​ పేర్కొన్నాడు.

ఇంకా తనకు ఇన్నోవా కొనాలని ఉందని.. అందుకోసం మసెరటి కారును అమ్మాలని అనుకుంటున్నట్లు సుశాంత్​ తెలిపాడు. అయితే, ఇది నష్టాన్ని కలిగించేలా ఉందని.. అతని సలహాదారుడు సుశాంత్​కు చెప్పాడు. దీంతోపాటు అన్నింటినీ వదిలేసి.. పవానా వంటి ఏకాంత ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నట్లు సుశాంత్​ ఆడియోటేప్​లో పేర్కొన్నాడు.

సుశాంత్​ కేసు విచారణలో భాగంగా సీబీఐ రియాను ప్రశ్నిస్తోంది. సుశాంత్​కు అందించిన వైద్య చికిత్స, ఇచ్చే మందులు, డ్రగ్స్​ గురించి ప్రస్తావించడం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details