బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. బిహార్ పోలీసులు నమోదు చేసిన FIR ఆధారంగా రూ.15 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల వల్లే ఇలా చేసింది.
సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న సుశాంత్ కేసు - సుశాంత్ ఆత్మహత్య
గత నాలుగురోజుల నుంచి కీలకమలుపులు తీసుకుంటున్న సుశాంత్ కేసు విషయంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సుశాంత్ బ్యాంక్ ఖాతా వివరాలను బిహార్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు మేరకు బాలీవుడ్ నటి రియా చక్రవర్తి సహా ఆరుగురిపై బిహర్‌లోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా బిహార్ పోలీసులు గురువారం, ముంబయిలో సోదాలు చేపట్టారు. సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు మరో ఖాతాకు జమ చేశారన్న ఆరోపణ వచ్చాయి. ఈ క్రమంలో వివిధ బ్యాంకుల్లోని సుశాంత్ ఖాతాల వివరాలు సేకరించారు.
అయితే ఈ విషయమై బిహార్ పోలీసుల దర్యాప్తునకు ముంబయి పోలీసులు అడ్డుంకులు సృష్టిస్తున్నారని బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ ఆరోపించారు. ఈకేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. మరోవైపు ఈ సాక్ష్యాల ఆధారంగా ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని మహారాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్ చెప్పారు. వీలైనంత త్వరలో విచారణ పూర్తవుతుందని స్పష్టం చేశారు.