వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటించిన 'దర్బార్' చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. డైరక్టర్ శివతో కొత్త సినిమా ప్రారంభానికి కాస్త సమయం ఉంది. అందుకే ఇప్పుడు హిమాలయాలకు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం రిషికేష్‌లోని స్వామి దయానంద ఆశ్రమానికి చేరుకున్న ఈ నటుడు... అక్కడి నుంచి బాబా గుహకు వెళ్తారని సమాచారం.
హిమాలయాల పర్యటనలో సూపర్‌స్టార్ రజనీకాంత్ - రజనీకాంత్ హిమాలయ పర్యటన
సూపర్‌స్టార్ రజనీకాంత్.. మరోసారి హిమాలయాల పర్యటనకు వెళ్లారు. సోమవారం.. స్వామి దయానంద ఆశ్రమాన్ని సందర్శించారు. తిరిగి ఐదు రోజుల తర్వాత చెన్నై చేరుకుంటారు.
హిమాలయాల పర్యటనలో సూపర్‌స్టార్ రజనీకాంత్
వాస్తవానికి నవంబరులో హిమాలయాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు రజనీ. అయితే షూటింగ్ కారణంగా ముందుగానే బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది. ఐదు రోజుల తర్వాత తిరిగి చెన్నై చేరుకుంటారు.
ఇది చదవండి:మాస్ దర్శకుడితో రజనీకాంత్ తర్వాతి సినిమా