తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాంకేతిక విప్లవానికి నాంది.. పద్మాలయ స్టూడియోస్​

టాలీవుడ్​ సూపర్​స్టార్​ కృష్ణ స్థాపించిన పద్మాలయ స్టూడియో శుక్రవారానికి 50 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా స్డూడియో విశేషాలు మీకోసం...

pad
పద్మాలయ

By

Published : Jul 11, 2020, 3:22 PM IST

Updated : Jul 11, 2020, 3:43 PM IST

బహుముఖ ప్రజ్ఞాశాలి టాలీవుడ్​ సీనియర్​ నటుడు సూపర్​స్టార్​ ఘట్టమనేని కృష్ణ. నటుడిగా తొలి చిత్రం 'తేనె మనసులు'తోనే తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. మొత్తంగా కెరీర్​లో​ 350కిపైగా సినిమాలు చేశారు. అప్పట్లోనే టాలీవుడ్​కు ఎన్నో టెక్నాలజీలను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కింది.

1970లో కృష్ణ సోదరుడు జి. ఆదిశేషగిరిరావుతో కలిసి పద్మాలయ స్టూడియోస్​ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్​లో తొలి చిత్రం 'అగ్ని పరీక్ష' రూపొందించగా.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్​బాస్టర్​ని అందుకున్నాయి. అయితే తాజాగా శుక్రవారానికి ఈ స్టూడియో​ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పద్మాలయ విశిష్టత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

పద్మాలయ

కొత్త ప్రయోగం

'అగ్ని పరీక్ష'తో హిట్​ అందుకున్నాక.. ఈ సారి కొత్త ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నారు కృష్ణ. హాలీవుడ్​ సినిమాలు 'మెకనాస్​ గోల్డ్'​, 'గుడ్​ బ్యాడ్​ అగ్లీ' తదితర చిత్రాల స్ఫూర్తితో కౌబాయ్​ కథను తయారు చేసి కెఎస్​ఆర్​ దాస్​ దర్శకత్వంలో 'మోసగాళ్లకు మోసగాడు' అనే అద్భుత చిత్రాన్ని రూపొందించారు. రొటీన్​ ప్రేమ కథలు, కుటుంబ గాథలు వస్తున్న రోజుల్లో.. ఈ సినిమా సరికొత్త ట్రెండ్​ను సృష్టించింది. ఇందులో కౌ​బాయ్​గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు సూపర్​స్టార్​. అప్పటి వరకు స్టూడియోస్​ వరకే పరిమితమైన చిత్ర నిర్మాణాన్ని అవుట్​డోర్​కు తీసుకెళ్లింది ఈ చిత్రమే. రాజస్థాన్​ ఎడారి, ప్రకృతి అందాలకు నిలయమైన ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్​ జరిపారు.

పద్మాలయ

అనంతరం 'పండంటి కాపురం', 'అల్లూరి సీతారామ రాజు', 'దేవుడు చేసిన మనుషులు' వంటి ఎన్నో మరపురాని సినిమాలు ఈ బ్యానర్​లో వచ్చినవే. ఈ చిత్రాల ద్వారా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు కృష్ణ. ఇక విజయ నిర్మల దర్శకత్వంలో 1974లో విడుదలైన తెలుగు చిత్రం 'దేవదాసు'. ఇందులో కృష్ణ నటన, ఆరుద్ర సంభాషణలు, గీతాలు... చిత్రానికి విలువను తెచ్చిపెట్టాయి.

ఫ్లాప్​ల నుంచి మళ్లీ విజయతీరాలకు

వరుస హిట్​ సినిమాలతో జోరుమీదున్న కృష్ణకు అనూహ్యరీతిలో ఫ్లాప్​లు మొదలయ్యాయి. ​ అలా మెల్లగా కెరీర్​ డౌన్​ అయిపోతున్న సమయంలో తన సొంత నిర్మాణ సంస్థలో 'పాడిపంటలు' అనే సినిమా తీసి 1976 సంక్రాంతికి విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. సాధారణంగా సంక్రాంతి అంటే ఎన్టీఆర్​, నాగేశ్వరరావు చిత్రాలు పోటీ పడుతుంటాయి. మిగతా హీరోలు ఈ పండగ బరిలో దిగడానికి సాహసించరు. కానీ కృష్ణ.. వారి సినిమాలకు దీటుగా 'పాడిపంటలు' విడుదల చేసి విజయం సాధించారు.

ఆ తర్వాత 1997 సంక్రాంతికి తన అభిమాన నటుడు ఎన్టీఆర్​ నటించిన 'దానవీర శూరకర్ణ' సినిమాకు పోటీగా 'కురుక్షేత్రం'తో మరోసారి తలపడ్డారు కృష్ణ. ప్రముఖ దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈసారి బాక్సాఫీసు యుద్ధంలో ఎన్టీఆర్​ సినిమా విజయం సాధించినప్పటికీ.. కృష్ణ సినిమా సాంకేతికంగా మాత్రమే పేరు, ప్రఖ్యాతలు గాంచింది. హిందీతో పాటు తమిళ, కన్నడంలోనూ చిత్రాలు నిర్మించి విజయం సాధించారు

సినీ ప్రపంచంలోనే ఓ సాహసం

సూపర్​స్టార్​ కృష్ణ సినీ ప్రపంచంలో ఓ సాహసం అనే అనాలి. వెండితెరకు అరంగేట్రం చేసిన తొమ్మిదేళ్ల వ్యవధిలోనే 'అల్లూరి సీతారామరాజు'తో 100 సినిమాలు పూర్తి చేసుకున్న ఘనతను దక్కించుకున్నారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ.. 1980లో డబుల్​ సెంచరీ చిత్రం 'ఈనాడు'ను విడుదల చేశారు. ఇది కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

సాంకేతికతకు పెద్దపీట

ఇక సాంకేతికతకు పెద్దపీట వేసే కృష్ణ.. తెలుగులో తొలి 70 ఎమ్​ఎమ్​ చిత్రం 'సింహాసనం' రూపొందించారు. సొంత బ్యానర్​లో తెరకెక్కిన ఈ చిత్రానికి.. తొలిసారిగా ఆయనే దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఇది కూడా కాసుల వర్షాన్ని కురిపించింది.

బాలీవుడ్​లోనూ

పద్మాలయ బ్యానర్​ తెలుగులోనే కాదు హిందీలోనూ సంచలనాలు సృష్టించింది. 1980లో 'టక్కరి' సినిమాతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టిన పద్మాలయ.. 'హిమ్మత్​ వాలా'తో ప్రభంజనం సృష్టించింది. కృష్ణ తెలుగులో నటించిన 'ఊరికి మొనగాడు' సినిమాకు ఇది రీమేక్​. ఈ మూవీతోనే బాలీవుడ్​లో శ్రీదేవి స్టార్​డమ్​ అందుకుంది. ఆ తర్వాత జితేంద్ర హీరోగా 'పాతాళభైరవి' వెంకటేశ్​ నటించిన 'సూర్యవంశం' హిందీ రీమేక్​ కూడా సూపర్​హిట్​గా నిలిచాయి. అనంతరం తమిళ, కన్నడ భాషల్లోనూ తన బ్యానర్​పై ఎన్నో సినిమాలు నిర్మించారు కృష్ణ.

ఇది చూడండి : బాలకృష్ణ సరసన ఉత్తరాది కొత్త భామ!

Last Updated : Jul 11, 2020, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details