కరన్‌జిత్ కౌర్ అమెరికాలో తన పిల్లలతో హాయిగా మెట్లమీద కూర్చుని ఉన్న ఓ చిత్రాన్ని మాతృదినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అయితే ఏంటి అనుకుంటున్నారా? కరన్‌జిత్ కౌర్ మరెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటి సన్నీ లియోనీ. మాతృదినోత్సవానికి ఒక్క రోజు ముందు, తాను ముంబయిలో లాక్‌డౌన్ నేపథ్యంలో వర్కవుట్లు చేస్తున్నట్టు, తన చిన్నారులను షికారుకు తీసుకెళ్లినట్టు ఉన్న వీడియోలను సన్నీ సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. దీనితో తను భారత్‌లోనే ఉందని అందరూ భావించారు. అంతలోనే అమెరికాలో ఉన్న చిత్రాన్ని విడుదల చేయటం వల్ల... ఇదెప్పుడబ్బా అని నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
అమెరికాలో ప్రత్యక్షమైన సన్నీ.. నెటిజన్ల ఆశ్చర్యం! - మదర్స్‌డే రోజున అమెరికాలో సన్నీలియోన్
లాక్‌డౌన్ కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది బాలీవుడ్ నటి సన్నీలియోనీ. ఇటీవలే ముంబయిలో తన నివాసంలో చిన్నారులతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేసిన ఈ భామ.. తాజాగా అమెరికా చేరినట్లు ట్విట్టర్లో తెలిపింది. అంతలోనే ముంబయి నుంచి అమెరికా ఎలా వెళ్లిందని పలువురు నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తన భర్త డానియల్ వెబర్, కుమార్తె నిషా, కొడుకులు నోవా, ఆషర్‌లతో సహా సన్నీ లియోన్ అమెరికాకు చెక్కేసింది. అక్కడికి ఎప్పుడు వెళ్లిందో వివరాలు తెలుపనప్పటికీ... వెళ్లాలన్న తన నిర్ణయం గురించి ఆమె..."మీకు పిల్లలు ఉన్నపుడు, మీ ప్రాముఖ్యాలు వేరుగా ఉంటాయి. మిగిలిన అన్నిటి కన్నా వారి క్షేమమే ముఖ్యమౌతుంది. కరోనా వైరస్ కనపడని వ్యాధి.. దీని నుంచి మరింత సురక్షితంగా ఉండగలమని మేము అనుకునే చోటుకి వెళ్లేందుకు మాకు అవకాశం లభించింది. మేము లాస్‌ఏంజిల్స్‌లో ఉన్న మా ఇంట్లోని సీక్రెట్ గార్డెన్‌లో ఉన్నాం. మా అమ్మ ఉండి ఉంటే తనూ ఇలాగే చేయమని చెప్పేది. మిస్ యూ మామ్. హ్యపీ మదర్స్ డే!" అని ట్విట్టర్లో వివరించింది. అయితే, తాము అమెరికాలోని తమ సొంత ఇంటిలో ఉన్నట్టు సన్నీ భర్త డానియల్ వెబర్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధృవీకరించాడు.
ఇదీ చూడండి..'మీరు ఎల్లపుడూ సంతోషంగా ఉండాలి'