ఓ రియాలిటీ షో చిత్రీకరణ కోసం ఇటీవల కేరళకు చేరుకుంది బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్. ఖాళీ సమయంలో సరదాగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడింది. దానికి సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. అందులో బ్యాట్‌తో బంతిని షాట్‌గా మలిచింది సన్నీ. ఇక తాను టీమ్ఇండియా జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ఆ వీడియోను జతచేస్తూ చమత్కరించింది.
ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడేందుకు సిద్ధం: సన్నీ - కేరళలో సన్నీలియోన్ క్రికెట్
బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్.. బ్యాట్ బట్టి క్రికెట్ ఆడుతూ సందడి చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో ఆడేందుకు తాను సిద్ధమని సన్నీ చమత్కరిస్తూ ఈ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది.
ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడేందుకు సిద్ధం: సన్నీ
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. 'ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడేందుకు నా కిట్‌ను సర్దుకోవచ్చా?' అంటూ సరదాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నీ రాసుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి:ట్రైలర్: 'దేశంలో క్రీడాకారుడికి కనీస గౌరవం ఇవ్వట్లేదు!'