కథానాయకుడు సందీప్ కిషన్‌లో చక్కని నటుడు, నిర్మాతతో పాటు మంచి భోజన ప్రియుడూ ఉన్నారు. ఈ అభిరుచితోనే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో 'వివాహ భోజనంబు' పేరుతో రెస్టారెంట్లు ప్రారంభించి సేవలందిస్తున్నారు. ఇప్పుడాయన ఇదే 'వివాహ భోజనంబు' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.
సందీప్ 'వివాహ భోజనంబు' రెడీ అవుతోందా..? - వివాహ భోజనంబు సినిమా
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నిర్మాణంలో మరో చిత్రం రాబోతుంది. 'వివాహ భోజనంబు' అనే టైటిల్‌తో సినిమాను నిర్మించనున్నట్లు సోషల్‌మీడియాలో ప్రకటించాడీ హీరో.
'నిను వీడని నీడని నేను', 'ఏ1 ఎక్స్‌ప్రెస్' చిత్రాల తర్వాత ఆయన నిర్మాణంలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. శినిష్ అనే మరో నిర్మాతతో కలిసి ఈ కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నారు సందీప్. సోమవారం ఈ సినిమా ప్రీ-లుక్‌ను విడుదల చేశారు. కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియజేసింది చిత్రబృందం.
రామ్ అబ్బరాజు దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. త్వరలోనే ఫస్ట్‌లుక్‌తో పాటు చిత్ర నాయకానాయికలు, ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రానికి కూర్పు ఛోటా.కె.ప్రసాద్, ఛాయాగ్రహణం మణికందన్ అందించనున్నారు.