తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'లూసిఫర్​' తెలుగు రీమేక్​కు దర్శకుడెవరో తెలుసా! - మెగాస్టార్​ చిరంజీవి

మెగాస్టార్​ చిరంజీవి కోసం మరో కథ సిద్ధమైంది. మలయాళంలో హిట్టు చిత్రం 'లూసిఫర్​' తెలుగు రీమేక్​లో ఈ స్టార్​హీరో నటించనున్నాడు. ఇప్పటికే రామ్​చరణ్​ చిత్ర హక్కుల్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమాకు సుకుమార్​ దర్శకత్వం వహిస్తాడని ప్రచారం జరుగుతోంది.

Sukumar Readied Lucifer Script for MegaStar Chiru
'లూసిఫర్​' తెలుగు రీమేక్​కు దర్శకుడెవరో తెలుసా..!

By

Published : Feb 12, 2020, 12:41 PM IST

Updated : Mar 1, 2020, 2:03 AM IST

మెగాస్టార్​ చిరంజీవి.. చిత్రసీమలోకి రీఎంట్రీ ఇవ్వగానే అభిమానులు నీరాజనం పట్టారు. 'ఖైదీ 150', 'సైరా నరసింహరెడ్డి' బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అయితే ఈ సినిమా ఫలితాల జోష్​తో వరుస సినిమాలకు ఓకే చెప్పాడీ స్టార్​హీరో. ప్రస్తుతం మలయాళ చిత్రం 'లూసిఫర్​' రీమేక్​కు రెడీ అవుతున్నట్లు సమాచారం.

యువత నాడిపట్టిన దర్శకుడే..

తండ్రి కోసమే ఈ సినిమా హక్కుల్ని రామ్‌చరణ్‌ సొంతం చేసుకొన్నాడట. తాజాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యత సుకుమార్​కు అప్పగించినట్లు తెలుస్తోంది. యువత మెచ్చే సినిమాలు చేయడంలో దిట్ట అయిన ఈ స్టార్​ డైరెక్టర్​.. ప్రస్తుతం 'లూసిఫర్​' స్క్రిప్ట్​ను తెలుగు నేటివిటీకి అణుగుణంగా మార్పులు చేసే పనిలో పడ్డాడట. మలయాళ చిత్రంలో మోహన్‌లాల్‌ పోషించిన పాత్రని చిరంజీవి... పృథ్వీరాజ్‌ క్యారెక్టర్​ను రామ్‌చరణ్‌ చేసే అవకాశాలున్నట్టు సమాచారం.

చిరంజీవి, సుకుమార్

మెగాస్టార్​ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు రామ్​చరణ్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీని తర్వాత త్రివిక్రమ్‌తో ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి.. బాహుబలి రికార్డుపై 'ఆర్ఆర్​ఆర్​' కన్ను!

Last Updated : Mar 1, 2020, 2:03 AM IST

ABOUT THE AUTHOR

...view details