తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లు అర్జున్​ను న్యూడ్​గా చూపించాలనుకున్నా: డైరెక్టర్ సుకుమార్ - sukumar mahesh babu pushpa movie

Pushpa climax: 'పుష్ప' క్లైమాక్స్​ గురించి షాకింగ్ విషయాలు చెప్పారు డైరెక్టర్ సుకుమార్. బన్నీ, ఫహాద్ ఫాజిల్​ను న్యూడ్​గా చూపించాలని అనుకున్నట్లు తెలిపారు.

allu arjun pushpa
అల్లు అర్జున్ పుష్ప

By

Published : Dec 25, 2021, 5:09 PM IST

Allu arjun pushpa: ఎర్రచందనం స్మగ్లింగ్ కథతో తీసిన 'పుష్ప' సినిమా.. థియేటర్ల దగ్గర దుమ్ములేపుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే అభిమానుల్ని అలరిస్తూ ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్​ సీన్​లో అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్​ను న్యూడ్​గా(పూర్తిగా బట్టల్లేకుండా) చూపించాలనుకున్నాననే షాకింగ్​ విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ చెప్పారు. కానీ తెలుగు ఆడియెన్స్ ఇలాంటి సీన్​ను ఒప్పుకోరని తెలిసి అందులో మార్పులు చేసినట్లు సుక్కు తెలిపారు.

sukumar mahesh babu: సూపర్​స్టార్ మహేశ్​బాబుతో గతంలో ఈ నేపథ్యంతోనే ఓ సినిమా చేయాలనుకున్నానని డైరెక్టర్ సుకుమార్ చెప్పారు. కానీ అది కుదురలేదని అన్నారు. అయితే ఈ రెండు స్టోరీలు వేర్వేరు అని స్పష్టం చేశారు.

అల్లు అర్జున్-సుకుమార్-మహేశ్​బాబు

"చాలాకాలం క్రితం మహేశ్​బాబుకు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యమున్న స్టోరీ చెప్పాను. అయితే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్న తర్వాత ఇదే నేపథ్యంగా క్యారెక్టర్​కు యాటిట్యూడ్​ ఉండేలా కొత్త కథ రాశాను. ఈ రెండూ డిఫరెంట్ స్టోరీలు" అని సుకుమార్ చెప్పారు.

అయితే తాను కొత్త కథ రాస్తున్నప్పుడు అల్లు అర్జున్​ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని రాశానని సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత బన్నీకి కథ వినిపించానని అన్నారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్

pushpa sukumar web series: తొలుత 'పుష్ప'ను ఓ వెబ్ సిరీస్​లా తీయాలని అనుకున్నానని.. కానీ ఇంతమంచి కథను సినిమాగా తీస్తే బాగుంటుందని అని భావించినట్లు సుకుమార్ చెప్పారు. అయితే ఒకే సినిమాలో కథ మొత్తం చెప్పడం కష్టమవుతుందని భావించి, దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని అల్లు అర్జున్, నిర్మాతలతో కలిసి నిర్ణయం తీసుకున్నట్లు సుక్కు స్పష్టం చేశారు.

రెండో భాగం 'పుష్ప: ద రూల్' షూటింగ్ ఫిబ్రవరిలో లేదా మార్చి మధ్యలో ప్రారంభిస్తామని సుకుమార్ చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ, రామ్​చరణ్​లతో సినిమాలు చేస్తానని పేర్కొన్నారు.

విజయ్ దేవరకొండ-రామ్​చరణ్-సుకుమార్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details