తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వర్ష రొమాంటిక్ డ్యాన్స్.. ఇమ్మాన్యుయేల్​ అయితే..! - ఇంద్రజ మూవీస్

ఈటీవీలో ప్రసారమయ్యే పలు ప్రోగ్రామ్స్​లో కనిపిస్తూ, అలరిస్తున్న వర్ష.. 'శ్రీదేవి డ్రామా కంపెనీ'(sridevi drama company promo) కొత్త ఎపిసోడ్​లో అదరగొట్టింది. 'చెప్పమ్మా చెప్పమ్మా' పాటకు రొమాంటిక్​గా డ్యాన్స్ చేసి ఆకట్టుకుంది.

sridevi drama company latest promo
శ్రీదేవి డ్రామా కంపెనీ

By

Published : Oct 25, 2021, 10:48 AM IST

'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో(sridevi drama company promo) కార్తీక వనభోజనాలు. అందుకు సంబంధించిన కొత్త ప్రోమో(sridevi drama company latest promo) అలరిస్తోంది. సీరియల్స్ ముద్దుగుమ్మ, టీవీషోల భామలతో సందడి సందడిగా సాగింది. వీరితో కలిసి సుధీర్(sudheer rashmi), ఆది, రాంప్రసాద్​ చేసిన హంగామా కూడా నవ్వు తెప్పిస్తోంది. అక్టోబరు 31న పూర్తి ఎపిసోడ్​ ప్రసారం కానుంది.

కార్తీక మాసం.. ఉసిరిచెట్టు కింద ఎవరు భోజనం చేయాలి అనే విషయమై సీరియల్స్, టీవీ షోల భామల మధ్య గొడవ జరగ్గా.. ఆ విషయమై సర్ది చెప్పేందుకు ఇంద్రజ(indraja movies), ఆమెతో పాటు అలనాటి తార సితార వచ్చారు.

ఈ క్రమంలోనే సుహాసిని, వర్ష తదితరులు డ్యాన్స్​తో అలరించారు. అలానే రెండు టీమ్​ల మధ్య అంత్యాక్షరి కూడా హాస్యభరితంగా సాగింది. అత్తకోడళ్ల నేపథ్యంగా స్కిట్​ కూడా చేశారు. చివర్లో అందరూ కలిసి కార్తీక మాసం భోజనాలు చేసి ప్రోమోను ముగించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details