'రాజ రాజ చోర' చిత్రానికి ఓటీటీ నుంచి వచ్చిన ఆఫర్లను చూసి ఆశ్చర్యపోయినట్లు యువ కథానాయకుడు శ్రీవిష్ణు తెలిపాడు. లాక్ డౌన్ కారణంగా తన గత చిత్రాలు ఓటీటీలో విడుదలై ప్రేక్షకులకు చేరువ కావడం వల్లే ఓటీటీలు తనవైపు చూస్తున్నాయని పేర్కొన్నాడు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్, యువతను ఆకట్టుకునే ఫన్ బాగా కుదిరాయని వెల్లడించాడు. థియేటర్ల వ్యవస్థను రక్షించాలనే ఉద్దేశంతో 'రాజ రాజ చోర' ఓటీటీకి ఇవ్వలేదని, థియేటర్లో ఇంటిల్లిపాది కూర్చొని చూడాల్సిన కథ అయినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీవిష్ణు పేర్కొన్నాడు.
'ఓటీటీ నుంచి వచ్చిన ఆఫర్లకు ఆశ్చర్యపోయా'
'రాజ రాజ చోర' చిత్రానికి ఓటీటీ ఆఫర్లు బాగా వచ్చాయని యువ నటుడు శ్రీవిష్ణు తెలిపాడు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈటీవీ భారత్తో ముచ్చటించిన ఈ నటుడు పలు విషయాలు వెల్లడించాడు.
శ్రీవిష్ణు, రాజ రాజ చోర
పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో హసిత్ గోలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదీ చదవండి:Raja Raja Chora: గంగవ్వ చెప్పిన 'చోర గాథ' విన్నారా?