తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాస్యం పండించడంలో ఈ దర్శకుడి రూటే సెపరేటు - TELUGU CINEMA NEWS

టాలీవుడ్​లో దర్శకుడు అనిల్ రావిపూడి దారే వేరు. తన సినిమాల్లో నటీనటులతో పండించే హాస్యం వినూత్నంగా ఉంటూ ఆకట్టుకుంటుంది. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు'తో మరోసారి అలాంటిదే రిపీట్ చేశాడు. ఈ సందర్భంగా అనిల్ గురించి ఈ ప్రత్యేక కథనం.

హాస్యం పండించడంలో ఈ దర్శకుడి రూటే సెపరేటు
దర్శకుడు అనిల్ రావిపూడి

By

Published : Jan 17, 2020, 7:25 PM IST

"సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలీదు కానీ పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది".. 'ఆగడు' సినిమాలో మహేశ్​బాబు చెప్పిన డైలాగ్. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రాలకు ఇది సరిగ్గా సరిపోతుంది. అతడు తీసిన 'సరిలేరు నీకెవ్వరు'.. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో నటీనటులు చేసిన వివిధ మేనరిజమ్స్ అలరిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తున్నాయి.

'సరిలేరు నీకెవ్వరు'లో వివిధ మేనరిజమ్స్

  • 'దేవుడా ఒక క్యూట్, స్వీట్, హ్యాండ్‌సమ్‌ కుర్రాణ్ని చూపించవయ్యా! నీకు అర్థమవుతుందా', 'ఐ లవ్‌ వ్యూ.. మీకు అర్థమవుతుందా'
  • 'అబ్బ...బ్బ...బ్బ.. ఇలాంటి ఎమోషన్స్‌ నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌'
  • 'అబ్బ..బ్బ..బ్బ.. ఇలాంటి డ్రామాలు నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌'
  • 'మ్యావ్‌.. మ్యావ్‌ పిల్లి.. మిల్క్‌బాయ్‌తో పెళ్లి'
  • 'చిన్న బ్రేక్‌ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది'
  • 'రమణా లోడు ఎత్తాలిరా.. చెక్‌ పోస్ట్‌ పడతాది'

ఒక్కో దర్శకుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దర్శకుడు అనిల్‌ రావిపూడి ఏ కథ ఎంచుకున్నా అందులో పక్కాగా కామెడీ ఉండాల్సిందే. ఈ విషయం అతడు గత చిత్రాలు చూస్తే తెలుస్తుంది. అయితో ఆ కామెడీలోనూ వినూత్న ప్రయెగాలు చేస్తుంటాడు. గతంలోనూ అతడు తీసిన సినిమాల్లో క్యాచీ సంభాషణలు ఇవే.

  • రవితేజ 'రాజా ది గ్రేట్‌'లో 'ఇట్స్‌ లాఫింగ్‌ టైం. హు.. హు.. హు..హు హూ..'.
  • వెంకటేశ్, వరుణ్, తమన్నా, మెహరీన్‌ల 'ఎఫ్‌ 2'లో.. మెహరీన్‌ చెప్పే 'హనీ ఈజ్‌ ద బెస్ట్‌', వెంకీ, వరుణ్‌ల 'అంతేగా అంతేగా'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details