కరోనా లాక్డౌన్ అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమపైనా తీవ్ర ప్రభావం చూపింది. దీంతో నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే తారలకు, ఎంతో తీరిక సమయం దొరికింది. కొందరు కుటుంబంతో సరదాగా గడుపుతుంటే.. మరికొందరు గత స్మృతులను గుర్తు తెచ్చుకొని వాటిని అభిమానులతో పంచుకుంటున్నారు. వీరిలో కొంతమంది తమ పాత అభిరుచులవైపు అడుగులేస్తున్నారు. సూపర్‌స్టార్ మమ్ముట్టి ఫొటోగ్రఫర్‌గా మారగా, మెగాస్టార్ చిరంజీవి తోటలో మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించారు. ముద్దుగుమ్మ సమంత అక్కినేని సొంతంగా తన ఇంట్లోనే క్యాబేజీ పండిస్తోంది. వీరితో పాటే ఇతర నటీనటులు ఏమేం చేస్తున్నారో చూసేద్దాం.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఫొటోగ్రాఫర్‌గా దర్శనమిచ్చారు. తాను తీసిన ఓ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి.. కరోనాపై అవగాహనతో పాటు, సినీ పరిశ్రమలోని విశేషాలను ఎప్పటికప్పుడూ తెలియజేస్తున్నారు. ప్రకృతిని కాపాడుకోవాలని సందేశమిస్తూ.. ఉద్యానవనంలో మొక్కలకు నీరు పోస్తున్న ఫొటోను ఇటీవలే షేర్ చేశారు.
లాక్డౌన్ వేళ ముద్దుగుమ్మ సమంత.. తన ఇంటి టెర్రస్‌ను గార్డెన్‌గా మార్చేసింది. అందులో క్యాబేజీని పండిస్తోంది. దీని అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.
ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్న హీరో దుల్కర్ సల్మాన్.. తన తోటలో పండే గూస్బెర్రీలకు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు. చెట్టెక్కి పండ్లను కోయడమంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు. ఇలా తన చిన్ననాటి అభిరుచులను గుర్తు చేసుకున్నాడు.