నటుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్‌లోనూ ఎందరికో సాయం చేస్తున్న సోనూ.. తాజాగా ఓ కరోనా బాధితురాలికి సాయం చేశాడు. వైరస్ బారిన పడి అత్యవసర చికిత్స కోసం ఎదురుచూస్తోన్న భారతి అనే మహిళను నాగ్‌పుర్ నుంచి విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలించడంలో సాయం చేశాడు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ పేషెంట్‌ను కాపాడటం కోసం ఏకంగా విమానాన్నే ఉపయోగించడం ద్వారా సోనూను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
సోనూ మరో సాయం.. విమానంలో కరోనా రోగి తరలింపు - సోనూసూద్ ఎయిర్‌లిఫ్ట్
కరోనాతో బాధపడుతున్న ఓ మహిళను హైదరాబాద్‌కు తరలించడంలో సాయం చేశాడు నటుడు సోనూసూద్. మెరుగైన చికిత్స కోసం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు విమానం ద్వారా ఆ మహిళను తరలించాడు,
సోనూసూద్
సోనూకు కరోనా నెగిటివ్
ఇటీవలే కరోనా బారిన పడిన సోనూ.. సాయం అంటూ వచ్చిన వారికి మద్దతుగా నిలుస్తున్నాడు. తాజాగా తనకు నెగిటివ్ వచ్చిందంటూ నెట్టింట పోస్ట్ చేశాడు.