తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సోనూసూద్ మంచి మనసు.. పేద కార్మికులకు మొబైల్స్ - ద కార్మికులకు సోనూసూద్ మొబైల్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో విలన్​గా చేస్తున్నాడు సోనూసూద్. తాజాగా ఈ మూవీ షూటింగ్​లో పాల్గొన్న 100 మంది పేద కార్మికులకు ఉచితంగా మొబైల్స్ అందించాడు సోనూ.

SonuSood gifted 100 mobile phones to poor workers in Acharya set
సోనూసూద్ మంచి మనసు

By

Published : Jan 6, 2021, 4:03 PM IST

సోనూసూద్.. సినిమాల్లో విలన్​గా ఎంతగానో పేరు తెచ్చుకున్న ఈ నటుడు లాక్​డౌన్​లో హీరోగా మారిపోయాడు. వలస కూలీలకు సాయం చేస్తూ అందరి ప్రశంసలు పొందాడు. లాక్​డౌన్ ఆంక్షలు ఎత్తివేశాక షూటింగ్స్​లో పాల్గొంటున్న సోనూసూద్ ఇప్పటికీ తన సేవలు కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా తన మంచి మనసు మరోసారి చాటుకున్నాడు.

కార్మికులకు మొబైల్స్ అందిస్తోన్న సోనూసూద్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో సోనూసూద్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈ షూటింగ్​లో పాల్గొన్న 100 మంది పేద కార్మికులకు ఉచితంగా మొబైల్స్ అందజేశాడు సోనూ. వాటిని అందుకున్న కార్మికులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మొబైల్స్​తో కార్మికులు

ABOUT THE AUTHOR

...view details