ప్రముఖ నటుడు సోనూసూద్.. 'ప్రవాసీ రోజ్గర్' కార్యక్రమంలో భాగంగా 20 వేలమంది వలసకూలీలకు వసతి కల్పించినట్లు సోమవారం వెల్లడించారు. దీనితో పాటే నోయిడాలోని గార్మెంట్స్ సంస్థలో వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
"ప్రవాసీ రోజ్గర్'లో భాగంగా 20 వేల మంది కూలీలకు వసతి కల్పించినందుకు చాలా ఆనందంగా ఉంది. వారందరూ నోయిడాలోని గార్మెంట్స్ సంస్థలో విధులు నిర్వర్తించనున్నారు" -సోనూసూద్ ట్వీట్
సోనూసూద్ ట్వీట్ చేసిన ఫొటో
మార్చిలో దేశంలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలసకూలీలకు సాయమందించారు సోనూసూద్. తన సొంత డబ్బులతో వారిని స్వస్థలాలకు చేర్చారు. ఈ క్రమంలోనే ఎంతోమంది మనసులో చోటు సంపాదించారు.
కరోనా ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి కోసం సోనూ, ప్రత్యేక యాప్ఆవిష్కరించారు. దేశంలో ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నయో ఇందులో తెలుసుకోవచ్చు.
వలసకూలీల కోసం ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్‌తో పాటు వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది సోనూసూద్ బృందం. వీరిని సంప్రదిస్తే పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలను వారి స్వస్థలాలకు చేర్చుతారు.