దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న వేళ సాయం చేసేందుకు బాలీవుడ్‌తో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్ అందరికంటే ముందుంటున్నారు. తన ఆస్తులు తాకట్టు పెట్టీ మరి అడిగిన వారికి సాయమందిస్తున్నారు.
సోనూసూద్ ఫౌండేషన్‌కు సారా అలీఖాన్ సాయం - సారా అలీఖాన్ వార్తలు
కరోనా సంక్షోభంలో దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నటుడు సోనూసూద్‌కు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ తన వంతు సాయంగా సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని సోనూ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
సోనూసూద్ ఫౌండేషన్‌కు సారా అలీఖాన్ సాయం
ఈ నేపథ్యంలో బాలీవుడ్ యంగ్ హీరోయిన్, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. సోనూసూద్‌కు మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విటర్ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు. "సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళం అందించిన సారా అలీఖాన్‌ను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాంటి మంచి పనులు కొనసాగించు. యువతకు నువ్వు ఆదర్శంగా నిలిచావు" అని ప్రశంసించారు.
ఇదీ చూడండి:20 ఏళ్ల తర్వాత భన్సాలీ దర్శకత్వంలో షారుక్?