తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సోనూ.. నా భర్త నుంచి దూరం చేయవా' - సోనూసూద్ తాజా వార్తలు

ఆయా ప్రాంతాల్లో చిక్కుకున్న వలసకూలీలను ఇళ్లకు పంపడంలో తన వంతు కృషి చేస్తున్న నటుడు సోనూసూద్​కు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ మహిళ.. తన భర్త నుంచి తనను దూరంగా పంపించాలని ట్విట్టర్​ ద్వారా అభ్యర్థించింది. దీనికి సోనూ ఫన్నీగా సమాధానమిచ్చారు.

sonu sudh
సోనూ సూద్​

By

Published : Jun 1, 2020, 1:13 PM IST

పలుచోట్ల చిక్కుకుపోయిన వలస కూలీలను, వారి స్వస్థలాలకు పంపుతున్నారు నటుడు సోనూసూద్. ఈ క్రమంలో అతడికి పలువురు నెటిజన్లు విచిత్రమైన అభ్యర్థనలు చేస్తున్నారు. ఓ మహిళ ఇప్పుడు ఏకంగా, భర్త నుంచి తనను దూరంగా వేరే చోటుకు పంపించాలని ట్వీట్ చేసింది. అంతకు ముందు ఓసారి ఇలానే ఓ వ్యక్తి తన ప్రేయసి దగ్గరకు వెళ్లేందుకు సాయమని సోనూ కోరాడు.

"సోనూసూద్‌.. జనతా కర్ఫ్యూ నుంచి లాక్‌డౌన్‌ 4 వరకు నేను నా భర్తతోనే ఉంటున్నాను. ఇప్పుడు అతన్ని బయటకు పంపించండి. లేదా నన్ను మా అమ్మ వాళ్ల ఇంటికి పంపించగలరా?.. ఎందుకంటే ఇకపై నేను అతనితో కలిసి ఉండలేను" అంటూ ఓ మహిళ సోనూను ట్యాగ్​ చేస్తూ ట్వీట్‌ చేసింది. స్పందించిన ఈ నటుడు.. "నా దగ్గర ఓ ప్లాన్‌ ఉంది. మీ ఇద్దరిని గోవా పంపిద్దాం. ఏమంటారు" అంటూ ఫన్నీగా బదులిచ్చారు.

వలస కూలీల కోసం బస్సులు ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా హెల్ప్​లైన్​ నంబర్​ను ప్రారంభించారు సోనూసూద్. వైద్యులకు పీపీఈ కిట్లు సరఫరా, తన హోటల్​లో వసతి ఏర్పాట్లు చేసి ఉదారత చాటుకున్నారు. ఇటీవల కేరళలో చిక్కుకున్న 180 మంది మహిళలు, చిన్నారులను ప్రత్యేక విమానం ద్వారా తమ స్వస్థలమైన ఒడిశాకు చేర్చారు. పలు సినిమాల్లో ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన సోనూ.. ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌ 'పృథ్వీరాజ్'లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి : 'గర్ల్​ఫ్రెండ్​ను కలవాలి.. సాయం చేయవా!'

ABOUT THE AUTHOR

...view details