ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. బేబీ బంప్ ఫోటోలు వైరల్ - bollywood actress sonam kapoor news

Sonam Kapoor Pregnancy: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్​ తాను గర్భం దాల్చినట్లు తెలిపింది. ఈ మేరకు తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి దిగిన ఫొటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.

Sonam Kapoor Pregnancy
గర్భం దాల్చిన సోనమ్​ కపూర్​
author img

By

Published : Mar 21, 2022, 1:50 PM IST

Sonam Kapoor Pregnancy: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్​ తల్లి కాబోతోంది. తాను మొదటిసారి గర్భం దాల్చినట్లు సోనమ్​ కపూర్​ తెలిపింది. భర్త ఆనంద్ ఆహుజాతో కలిసి దిగిన ఫొటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఈ విషయంపై ఆనంద్ ఆహుజా ఆనందం వ్యక్తం చేశాడు.

in article image
గర్భం దాల్చిన సోనమ్​ కపూర్​

పుట్టబోయే శిశువును ఉద్దేశిస్తూ.. 'మిమ్మల్ని ఉత్తమంగా పెంచగలం. మా రెండు హృదయాలు మీతోపాటే కొట్టుకుంటాయి. ప్రేమానురాగాలు పంచే కుటుంబం మీకు ఉంటుంది. మిమ్మల్ని త్వరగా ఆహ్వానిస్తున్నాం' అని హ్యాష్​ట్యాగ్​లో రాసుకొచ్చింది సోనమ్.

భర్త ఆనంద్ అహుజాతో సోనమ్​..

సోనమ్​కు పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలిపారు. 'పిల్లలతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉండండి' అంటూ సోనమ్​ జంటకు కరీనా కపూర్​ పేర్కొంది. 'చాలా మంచి శుభవార్త' అంటూ దియా మిర్జా తెలిపింది. అనన్య పాండే సహా పలువురు నటీనటులు సోనమ్ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

సోనమ్​ కపూర్​, ఆనంద్ అహుజాకు 2018లో వివాహం అయ్యింది. సోనమ్ కపూర్​.. నటుడు అనిల్ కపూర్, సునీత కపూర్​ పెద్ద కుమార్తె. సోనమ్ పెళ్లి అయినప్పటి నుంచీ చాలా సార్లు ప్రెగ్నెన్సీ పుకార్లు వచ్చాయి. అయితే.. వాటిని ఆమె ఖండిస్తూ వచ్చింది.

ఇదీ చదవండి:అమృత్​సర్​లో 'ఆర్​ఆర్​ఆర్' టీమ్.. 'కేజీఎఫ్-2' నుంచి 'తుఫాన్'

ABOUT THE AUTHOR

...view details