తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ డ్రస్సు కోసం హీరోయిన్ల మాటల యుద్ధం..! - jeans shorts

హీరోయిన్ జాన్వీ కపూర్ వేసుకునే జీన్స్ షార్ట్స్... నెట్టింట్లో పెద్ద చర్చకు కారణమయ్యాయి. జాన్వీ వస్త్రధారణపై కత్రినా కైఫ్​ చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా సమాధానమిచ్చింది సోనమ్ కపూర్.

ఆ డ్రస్సు కోసం హీరోయిన్ల మాటల యుద్ధం

By

Published : Jun 2, 2019, 6:53 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు బాలీవుడ్ ​ హీరోయిన్ జాన్వీ కపూర్​ వేసుకునే దుస్తుల విషయమై తాను చింతిస్తున్నానంటూ తెలిపింది కత్రినా కైఫ్‌. వీరిద్దరూ బాంద్రాలోని ఒకే జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటారు. అక్కడికి చిట్టిపొట్టి షార్ట్స్‌ వేసుకొని వెళ్తుంటుంది జాన్వీ. ఈ ఫొటోలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూనే ఉంటాయి. ఇటీవల ఓ ముఖాముఖిలో ఈ విషయంపై మాట్లాడింది కత్రినా.

‘‘జాన్వీ జిమ్‌కు మరీ చిన్నగా కనిపించే షార్ట్స్‌ వేసుకొస్తూ ఉంటుంది. ఆ విషయంలో నేను కాస్త భయపడుతుంటాను. ఇద్దరం ఒకే జిమ్‌కి వెళతాం. కలిసే వర్కవుట్లు చేస్తుంటాం. కానీ తన దుస్తుల విషయంలో మాత్రం కాస్త చింతిస్తుంటాను’’ -కత్రినా కైఫ్, బాలీవుడ్​ హీరోయిన్

అనంతరం సోనమ్‌ కపూర్‌ ఈ విషయంపై స్పందించింది. సోదరి జాన్వీని సమర్ధిస్తూ షార్ట్స్‌లో ఉన్న ఫొటోను ఇన్​స్టాలో షేర్‌ చేసింది. పరోక్షంగా కత్రినా కైఫ్​కు సమాధానమిచ్చింది.

సోనమ్ కపూర్ ఇన్​స్టాగ్రామ్ పోస్ట్

‘‘జాన్వీ సాధారణ దుస్తులూ వేసుకుంటుంది. వాటిలో ఆమె మరింత అందంగా కనిపిస్తుంటుంది’’ -సోనమ్ కపూర్, హీరోయిన్

అనంతరం వీరిద్దరి వ్యాఖ్యలపై మీడియాలో వివిధ కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ దుమారంపై ట్విట్టర్​ వేదికగా కత్రినాతో తనుకున్న అనుబంధాన్ని వెల్లడించింది సోనమ్.

"నా స్నేహితురాలు కత్రినా.. చేసిన వ్యాఖ్యలకు దీటుగా జాన్వీని సమర్థించాలని నేను ప్రయత్నించలేదు. కత్రినా మామూలుగానే ఆ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని మీడియా పెద్దది చేయొద్దు" -సోనమ్ కపూర్, బాలీవుడ్ కథానాయిక

సోనమ్ కపూర్ ట్వీట్

ఇది చదవండి: 'రౌడీ బేబీ'... యూట్యూబ్​లో 'రికార్డ్​ బేబీ'... 500 మిలియన్ల వీక్షణలు అందుకున్న పాట

ABOUT THE AUTHOR

...view details