బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాన్ని కొంతమంది వ్యక్తులు ప్రచారానికి వినియోగించుకుంటున్నారని సోనాక్షి సిన్హా ఆరోపించారు. ఎవరి పేరు ప్రస్తావించకుండా.. మంగళవారం ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్ మృతిపై తప్పుడు వార్తలు సృష్టించొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
"పందులతో పోట్లాడటం వృథా ప్రయాస. ఎందుకంటే మిమ్మల్ని మురికిగా చేసి అవి ఆనందిస్తాయి. కొంత మంది సుశాంత్ మరణాన్ని వారికి అదునుగా ఉపయోగించుకుని ప్రచారం కల్పించుకుంటున్నారు. దయచేసి వాటన్నింటినీ ఆపేయండి."