తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శేష్ 'మేజర్​' కోసం మళ్లీ ఆ హీరోయిన్​ - శోభితా ధూళిపాల్ల, అడవి శేషు

'గూఢచారి'తో అలరించిన అడివి శేష్-శోభిత జోడీ మరోసారి తెరపై సందడి చేయనుంది. 'మేజర్'​ సినిమాలో ఆమెనే హీరోయిన్​గా చేస్తున్నట్లు ఈరోజు (సోమవారం) ప్రకటించారు.

Sobhita Dhulipala in Mahesh Babu's debut production Major
శేష్ 'మేజర్​' కోసం మళ్లీ ఆ హీరోయిన్​

By

Published : Mar 2, 2020, 12:26 PM IST

Updated : Mar 3, 2020, 3:36 AM IST

తక్కువ బడ్జెట్​తో సినిమాలు తీసి, అభిమానులను ఆదరణ అందుకుంటున్నాడు హీరో అడివి శేష్. ఇటీవల కాలంలో 'ఎవరు', 'గూఢచారి' చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం బయోపిక్​ 'మేజర్'లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో హీరోయిన్​గా శోభితా ధూళిపాళ్ల నటిస్తోంది. ఈ విషయాన్ని నేడు ధ్రువీకరించారు.

గతంలో వీరిద్దరూ 'గూఢచారి'లో కలిసి నటించారు. ఇప్పుడు 'మేజర్'తో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

శేష్ 'మేజర్​' కోసం మళ్లీ ఆ హీరోయిన్​

నిజ జీవితం ఆధారంగా

ఎన్​ఎస్​జీ కమాండర్ మేజర్​ సందీప్​ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' తీస్తున్నారు. అడివి శేష్ టైటిల్​ రోల్​లో కనిపించనున్నాడు. 26/11 దాడుల సమయంలో తాజ్​​ హోటల్​లో చిక్కుకున్న 14 మందిని రక్షించే క్రమంలో తన ప్రాణాలను కోల్పోయారు సందీప్.​ ఈ ప్రాజెక్టును సోనీ పిక్చర్స్, సూపర్​స్టార్ మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదీ చదవండి:'ప్లేట్లు కడగడం నుంచి జీవితాన్ని ప్రారంభించా'

Last Updated : Mar 3, 2020, 3:36 AM IST

ABOUT THE AUTHOR

...view details