తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మారుతితో సాయిధరమ్ తేజ్ సినిమా? - maruthi

యూత్​ఫుల్ దర్శకుడు మారుతితో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

సాయి, మారుతి

By

Published : May 1, 2019, 4:06 PM IST

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది.

మెగా కాంపౌండ్ నుంచి వచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయిధరమ్ తేజ్. యూత్‌ఫుల్‌ కథాంశాలను తీయడంలో దిట్టగా పేరు సంపాదించిన దర్శకుడు మారుతి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఇంతకుముందు ఇదే బ్యానర్‌లో మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘'భలే భలే మగాడివోయ్‌' విజయాన్నందుకొంది. ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్‌లో సినిమా రూపొందబోతోంది.

మూడు తరాలకు చెందిన వ్యక్తుల మధ్య అనుబంధాలను చూపించే సినిమాగా కథాంశం ఉండబోతోందట. జూన్‌లో సెట్స్‌ పైకి వెళ్లబోతోంది. అధికారంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది.

ఇవీ చూడండి.. 'నెట్​ఫ్లిక్స్' నిర్మాతలుగా ఒబామా దంపతులు బిజీ

ABOUT THE AUTHOR

...view details