తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హీరోయిన్​కు ప్రపోజ్ చేయలేదు: సూర్య

నటి ప్రియాభవానీ శంకర్​కు ప్రపోజ్ చేసినట్లు.. అందుకు ఆమె తిరస్కరించినట్లు వస్తున్న వార్తలను ట్విట్టర్ వేదికగా ఖండించాడు దర్శకనటుడు ఎస్​జే సూర్య. అసత్యాలను ప్రచారం చేయొద్దని కోరాడు.

Sj Suryah Love Propsal Love Proposal To PriyaBhavani Shankar
ఎస్​జే సూర్య

By

Published : Jan 16, 2020, 6:31 PM IST

'వాలి', 'ఖుషి' లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించి అనంతరం నటుడిగా అవతారమెత్తి అందులోనూ మెప్పిస్తున్నాడు ఎస్​జే సూర్య. అయితే ఈ దర్శకనటుడిపై కోలీవుడ్​లో ఓ వార్త హల్​చల్ చేస్తోంది. ఇతడు నటి ప్రియాభవానీ శంకర్​కు లవ్​ ప్రపోజ్ చేసినట్లు, అందుకు ఆమె తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఎస్​జే సూర్య స్పందించాడు.

"కొందరు పనిలేనివాళ్లు పనిగట్టుకొని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ప్రియాభవానీ శంకర్​కు లవ్ ప్రపోజ్ చేశానని, ఆమె తిరస్కరించిందని అసత్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు. 'మాన్​స్టర్' చిత్రం నుంచి ఆమె నాకు మంచి స్నేహితురాలు. అలాగే మంచి నటి కూడా. దయచేసి నన్ను విసిగించకండి, ఆధారాల్లేని, అసత్యవార్తలను వ్యాప్తి చేయొద్దు"

- ఎస్​జే సూర్య ట్వీట్​.

ప్రస్తుతం ఎస్​జే సూర్య నటుడిగా బిజీగా ఉన్నాడు. 'నెనజమ్​ మరప్పతిల్లాయ్​', 'ఇరివాకలమ్' తదితర చిత్రాల్లో నటిస్తున్నాడు. మహేశ్​ హీరోగా రూపొందిన 'స్పైడర్' సినిమాలో సైకోగా కనిపించి తన నటనతో విమర్శకులను మెప్పించాడు ఎస్​జే సూర్య.

ఇదీ చదవండి: 'లుంగీని మహేశ్​ ఇంకొంచెం పైకి లేపుతాడా అని చూశారు'

ABOUT THE AUTHOR

...view details