కోలీవుడ్‌లో అశేష అభిమానులను సొంతం చేసుకున్న హీరోల్లో శివకార్తికేయన్ ఒకరు. తమిళ్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి... ఆ తర్వాత యాంకర్ అయ్యాడు. మెల్లగా ఆవకాశాలు రావడం వల్ల సినిమాల్లో చిన్న పాత్రలను చేస్తూ.. ప్రస్తుతం మాస్ హీరోగా గుర్తింపు పొందాడు. తాజాగా, ఈ హీరో ట్విట్టర్లో అరుదైన ఘనత సాధించాడు. ఇప్పటివరకు 6 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని.. రజినీకాంత్, విజయ్ సేతుపతిలను పక్కకు నెట్టాడు. ఈ నేపథ్యంలోనే ఇంతటి ఘనతను కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
కోలీవుడ్‌లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన హీరో ధనుష్. ట్విట్టర్లో 9 మిలియన్లకు పైగా అభిమానులు ధనుష్‌ను అనుసరిస్తున్నారు. మరోవైపు కమల్‌హాసన్‌కు 7 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక రజనీ కాంత్‌ను 5.7 మిలియన్ల అభిమానులు అనుసరిస్తుండగా.. విజయ్ సేతుపతికి 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరినీ అధిగమించాడు శివకార్తికేయన్.