Chiranjeevi on Sirivennela: సిరివెన్నెల సీతారామ శాస్త్రి తెలుగు సినీ పరిశ్రమకు చిట్టచివరి సాహితీ దిగ్గజంగా నిలిచిపోతారని అగ్రనటుడు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆయనలా సాహిత్య సేవ చేసే వారు మరొకరు రారని అన్నారు. సిరివెన్నెల మరణంతో మంచి మిత్రుడిని కోల్పోయానన్న భావన కలుగుతోందని భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెల తన గురించి పాటలు రాయడం అదృష్టమని అన్నారు.
"తెలుగు పరిశ్రమకు ఇది చాలా పెద్ద లోటు. ఎవరూ భర్తీ చేయలేని లోటు. ఇది చాలా దురదృష్టకరం. ఇలా సుదీర్ఘంగా సాహిత్య సేవ చేసే వారు ఈ పరిశ్రమకు మరొకరు రారు. సాహిత్య పరిశ్రమకు చివరి లెజెండ్ ఆయనే. ఆయనను స్మరించుకోవడం చాలా అవసరం. సిరివెన్నెల సన్నిహితులు, త్రివిక్రమ్‌తో చర్చించి సిరివెన్నెలను స్మరించుకునేలా ఏదైనా కార్యక్రమాలు చేపడతాం."