ఎస్పీ బాలుకు అస్వస్థత- ఐసీయూలో చికిత్స
ఎస్పీ బాలుకు అస్వస్థత- ఐసీయూలో చికిత్స
16:50 August 14
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
బాలుకు కరోనా సోకినట్టు ఈనెల 5న నిర్ధరణ అయింది. అప్పటినుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే గురువారం రాత్రి ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. నిపుణుల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తోంది.
Last Updated : Aug 14, 2020, 5:28 PM IST