తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మహాసముద్రం'లో సిద్ధార్థ్.. ప్రకటించిన చిత్రబృందం

యువ కథానాయకుడు శర్వానంద్​ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మహాసముద్రం'. ఈ సినిమాలో మరో కీలకపాత్ర కోసం నటుడు సిద్ధార్థ్​ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది చిత్రబృందం.

Siddharth with Sharwanand in the movie MahaSamudram Multistarrer
మల్టీస్టారర్​గా తెరకెక్కనున్న 'మహాసముద్రం'

By

Published : Sep 18, 2020, 11:16 AM IST

టాలీవుడ్​ విలక్షణ నటుడు శర్వానంద్​ హీరోగా అజయ్​ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మహాసముద్రం'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ సినిమా మల్టీస్టారర్​గా రూపొందనుందని దర్శకుడు స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో శర్వానంద్​తో పాటు మరో కీలకపాత్ర కోసం నటుడు సిద్ధార్థ్​ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది.

'ఆర్​ఎక్స్​ 100' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అజయ్​ భూపతి.. అదే సినిమా తరహాలోనే ఉండే విభిన్న కథతో రెండో చిత్రాన్ని తీయనున్నట్లు గతంలోనే వెల్లడించాడు. తెలుగు-తమిళ భాషాల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరపనున్నారు. ప్రతి వారం ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్​డేట్​ ఇవ్వనున్నట్లు చిత్రబృందం గతంలోనే తెలిపింది. ఈ వారం నటుడు సిద్ధార్థ్​ను కీలకపాత్ర కోసం ఎంచుకున్నట్లు స్పష్టత ఇచ్చింది. అనిల్​ సుంకర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. మిగిలిన సాంకేతిక నిపుణల వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details