కొంత విరామం తర్వాత 'క్రాక్'తో తెలుగులో అడుగుపెట్టి భారీ హిట్ కొట్టింది శ్రుతిహాసన్. కరోనా లాక్డౌన్ పరిస్థితులు తర్వాత థియేటర్లు తెరుచుకున్నాకా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించి భారీ వసూళ్లు అందుకుంది. కాగా, థియేటర్లు మూసేసిన సమయంలో ప్రేక్షకులకు, చిత్ర పరిశ్రమకు ఓటీటీ వేదికలే దారీ చూపాయి. మరి ఓటీటీ.. థియేటర్ ఈ రెండింటిలో ఏది గొప్పది? అంటే శ్రుతి హాసన్ ఈ విధంగా స్పందించింది.
ఆ అనుభూతికి ఏదీ సాటిరాదు: శ్రుతిహాసన్ - shrutihassan
థియేటర్లో సినిమా చూసిన అనుభూతికి ఏదీ సాటిరాదని చెప్పింది నటి శ్రుతిహాసన్. అయితే ఓటీటీ వేదికలంటే తనకెంతో అభిమానమని తెలిపింది. థియేటర్.. ఓటీటీ ఈ రెండింటితోనూ ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించింది.
"థియేటర్లో సినిమా చూసిన అనుభూతికి ఏదీ సాటిరాదు. కొన్ని సినిమాలను పూర్తిగా థియేటర్లోనే చూడగలం. అదే సమయంలో ఓటీటీ వేదికలన్నా నాకు చాలా అభిమానం. వాటిలో ఎన్నో గొప్ప కథా చిత్రాలు ప్రేక్షకులకు దొరుకుతున్నాయి. నేనూ ఎన్నో వైవిధ్యమైన సినిమాల్ని, వెబ్‌సిరీస్‌లను అందులోనే చూశా. థియేటర్ల వరకు రాలేని ఎన్నో గొప్ప కథల్ని వాటిల్లో చూడగలుగుతున్నాం. నాకు థియేటర్.. ఓటీటీ ఈ రెండింటితోనూ ఉన్న ప్రయోజనాలేంటో బాగా తెలుసు" అని చెప్పింది శ్రుతి. ప్రస్తుతం ఆమె ప్రభాస్ 'సలార్'లో నటిస్తోంది.
ఇదీ చూడండి: నా హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం: శ్రుతిహాసన్