టాలీవుడ్ హీరోయిన్ శ్రియ.. బార్సిలోనా టెన్నిస్ క్రీడాకారుడు ఆండ్రూ కొశ్చివ్ను పెళ్లి చేసుకుని, ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న ఈ జోడీ.. పలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానుల్ని అలరిస్తోంది. అయితే ఇటీవలే తన భర్తకు కరోనా లక్షణాలు కనిపించాయని చెప్పింది. ఓ ఆంగ్ర దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పేర్కొంది.
ముద్దుగుమ్మ శ్రియ భర్తకు కరోనా! - కొవిడ్ వార్తలు
నటి శ్రియ భర్తకు కరోనా లక్షణాలు కనిపించాయి. ఈ విషయాన్ని ఆమెనే చెప్పింది. అయితే వైద్యులు తమను స్వీయ నిర్బంధంలో ఉండమని సూచించినట్లు తెలిపింది.
నటి శ్రియ
పొడి దగ్గు, జ్వరంతో ఆండ్రూ బాధపడటం వల్ల.. అతడిని వెంటనే ఆసుపత్రిలో చేర్చామని, ప్రస్తుతం బాగానే ఉన్నాడని శ్రియ వెల్లడించింది. వైద్యులు, తమను కొన్నిరోజులు పాటు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండమని చెప్పినట్లు తెలిపింది.
ఇది చదవండి:ఈ సెలబ్రిటీ భార్యభర్తలు అల్లరే అల్లరి