తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇన్​స్టాకు స్వాగతం.. మీరో అద్భుత డార్లింగ్' - bollywood

టాలీవుడ్ నటుడు ప్రభాస్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించాడు. ఈ ఖాతాకు స్వాగతం పలుకుతూ బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ మీరో అద్భుతమైన డార్లింగ్ అంటూ ప్రసంశలు కురిపించింది.

ప్రభాస్, శ్రద్ధా

By

Published : Apr 28, 2019, 4:09 PM IST

సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమ సినిమా అప్​డేట్స్​ను ఎప్పటికప్పుడు పంచుకోవడం కోసం ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. తాజాగా బాహుబలి ప్రభాస్ కూడా ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​ ప్రారంభించాడు. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఇన్​స్టాలో ప్రభాస్​కు స్వాగతం పలికింది.

టాలీవుడ్‌ బాహుబలి ప్రభాస్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ప్రారంభించాడు. సెలబ్రిటీల ఖాతాలను సులువుగా గుర్తించేందుకు బ్లూ టిక్‌ మార్క్‌ సదరు సంస్థ తనిఖీ చేసి ఇస్తుంది. అలానే ప్రభాస్‌ ఖాతాకు కూడా టిక్ మార్క్ ఇచ్చేశారు.

బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌ ప్రభాస్‌ ఖాతాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ చిత్రాన్ని పంపి స్వాగతం పలికింది. "‘ఇన్‌స్టాకు స్వాగతం.. నేను ఇప్పటి వరకు కలిసిన వారిలో అద్భుతమైన డార్లింగ్‌ మీరే".. అంటూ రాసింది. ఈ కామెంట్‌ను ఇద్దరి అభిమానులు తెగ లైక్‌ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details