తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సుశాంత్ లేడన్న నిజాన్ని నమ్మలేకపోతున్నా' - Shraddha Kapoor pay tribute to sushant singh

సుశాంత్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన నటి శ్రద్ధా కపూర్.. అతడు లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపింది. ఇందులో భాగంగా వీరిద్దరూ కలిసున్న ఫొటోను పోస్ట్ చేయడం సహా ఇన్​స్టాలో భావోద్వేగభరిత అంశాల్ని పంచుకుంది.

shraddha
శ్రద్ధా

By

Published : Jun 18, 2020, 9:26 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఇక లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని హీరోయిన్ శ్రద్ధా కపూర్ చెప్పింది. అతడితో ఉన్న సందర్భాలను గుర్తుచేసుకుంది. దయ, జాలి, చురుకుదనం, తెలివి, ఉత్సుకత లాంటి సద్గుణాలు సుశాంత్ ఉన్నాయని తెలిపింది. "ది సీక్రెట్​ ప్రిన్సిపల్స్​ ఆఫ్​ జీనియస్​" పుస్తకం కవర్​పేజితో సహా వీరిద్దరు కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్​స్టాలో పంచుకుని, భావోద్వేగ పోస్ట్ పెట్టింది.

గతేడాది వచ్చిన 'చిచ్చోరే'లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సుశాంత్​ తనతో ఎలా ఉండేవాడో ఆ సందర్భాలను గుర్తుచేసుకుంది శ్రద్ధా.

"సుశాంత్​ సెట్​కు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆతురతగా ఎదురుచూసేదాన్ని. ఎందుకంటే అతడి వ్యక్తిత్వం ఎంతో గొప్పది. ఎంత మంచి మనసో అంతే మేధావి కూడా. తన జీవితాన్ని తానే రూపుదిద్దుకున్నాడు. నచ్చిన పని చేసుకుంటూ అందులోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. షూటింగ్​లో ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల ఫిలాసఫీలు గురించి మేం మాట్లాడుకునేవాళ్లం. అతడితో గడిపిన ఆ క్షణాలన్నీ అద్భుతం. ప్రస్తుతం సుశాంత్​ను చాలా మిస్​ అవుతున్నాను"

-శ్రద్ధాకపూర్​, బాలీవుడ్​ హీరోయిన్​

ఖగోళశాస్త్రం, సైన్స్, ప్రకృతి​ అంటే సుశాంత్​కు ఎంతో ఇష్టమని శ్రద్ధా చెప్పింది. కొత్త విషయాలను తెలుసుకోవడం, వాటి కోసం అనేష్వించడం చేసేవాడని తెలిపింది. తన ఇంట్లో అమర్చుకున్న టెలిస్కోప్ ద్వారా ఆకాశంలోని తారలను, వింతలు విశేషాలను, అతడు పొందిన అనుభూతులను అందరితో ఎప్పుడూ పంచుకునేవాడని వెల్లడించింది. ముఖ్యంగా సుశాంత్​లో ఓ గొప్ప కవి, గాయకుడు ఉన్నాడని వివరించింది.

ఇది చూడండి :

సుశాంత్ మృతిపై ఏక్తా: ఎప్పటికైనా గెలిచేది నిజమే

సుశాంత్​ ట్విట్టర్​ కవర్​పేజీకి అర్థం అదేనా?

ధైర్యం చెప్పాడు.. అంతలోనే తనువు చాలించాడు!

ABOUT THE AUTHOR

...view details