టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ షాకింగ్ లుక్‌లో కనిపించాడు. తన కొత్త సినిమా కోసం ఏకంగా బట్టల్లేకుండా నటిస్తున్నాడు. ఈ విషయం ఆ ఫస్ట్‌లుక్ పోస్టర్ చెబుతోంది. ఈ చిత్రానికి 'నాంది' అనే టైటిల్ ఖరారు చేశారు. చాలా కాలం విరామం తర్వాత ఇటీవలే ఈ ప్రాజెక్టు ప్రకటించాడీ కథానాయకుడు. నేడు(సోమవారం) హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా మొదలుకానుందీ సినిమా.
అల్లరి నరేశ్ షాకింగ్ లుక్.. సినిమా కోసం బట్టల్లేకుండా - entertainment news
అల్లరి నరేశ్ 'నాంది' సినిమా ఫస్ట్‌లుక్ అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఇందులో బట్టల్లేకుండా కనిపించి, ఆశ్చర్యపరిచాడీ హీరో.
'నాంది' ఫస్ట్‌లుక్‌లో అల్లరి నరేశ్
ఈ పోస్టర్లో నరేశ్‌ను ఒంటిపై బట్టల్లేకుండా.. చేతులు, కాళ్లు బంధించి.. తల క్రిందులుగా వేలాడదీసున్నారు. ఈ లుక్ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేస్తోంది. కథ ఏంటి? అనే ఆసక్తిని అప్పుడే కలిగిస్తోంది.
ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. హరీశ్ ఉత్తమన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సతీశ్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.