తెలంగాణ

telangana

ETV Bharat / sitara

priyamani: ప్రియమణికి షారుక్​ఖాన్ రూ.300.. ఎందుకు? - ప్రియమణి లేటెస్ట్​ న్యూస్​

బాలీవుడ్​ స్టార్ షారుక్​ ఖాన్​(Sharukh Khan) తనకు రూ.300 ఇచ్చిన విషయాన్ని ప్రముఖ నటి ప్రియమణి(Priyamani) గుర్తుచేసుకుంది. 'చెన్నై ఎక్స్​ప్రెస్'​ సినిమా షూటింగ్​ సమయంలో జరిగిన ఆ సంఘటన గురించి తాజాగా పంచుకుంది.

priyamani
ప్రియమణి

By

Published : Jun 17, 2021, 12:18 PM IST

Updated : Jun 17, 2021, 12:36 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో షారుక్​ ఖాన్​పై​(Sharukh Khan) ప్రశంసలు కురిపించింది నటి ప్రియమణి(Priyamani). బాద్​షా మంచి వ్యక్తిత్వమున్న వ్యక్తి అని చెప్పింది. ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్‌ 2'(The Family man2) వెబ్‌సిరీస్ విడుదలై విజయం సాధించిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. షారుక్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'చెన్నై ఎక్స్​ప్రెస్'(Chennai Express)​ సినిమాలో ఆయనతో కలిసి ఓ స్పెషల్​ సాంగ్​లో ప్రియమణి చిందేసింది. ఆ సమయంలో షారుక్​ తనకు రూ.300 ఇచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది.

"ఈ పాట షూటింగ్ ఐదు రాత్రుల పాటు​ జరిగింది. అదో గొప్ప అనుభవం. షారుక్ సూపర్​స్టార్​ అయినా సరే​ చాలా సింపుల్​గా ఉంటారు. అస్సలు గర్వం ఉండదు. ఎంతో మంచి వ్యక్తి. తన చుట్టూ ఉన్న వాళ్లను బాగా చూసుకుంటారు. వాళ్లతో చాలా చక్కగా కలిసిపోతారు. అందుకే ఆయన్ను అందరూ ప్రేమిస్తారు. నేను షూటింగ్​ను వెళ్లి రోజు నుంచి అయిపోయేవరకు మమల్ని చాలా బాగా చూసుకున్నారు. నేను చాలా సౌకర్యవంతంగా ఫీలయ్యాను. ఈ క్రమంలోనే మేమిద్దరం ఐప్యాడ్​లో కౌన్​ బనేగా కరోడ్​పతి గేమ్​ ఆడాం. అందులో గెలిచినందుకు ఆయన నాకు రూ.300 రూపాయలు ఇచ్చారు. అవి ఇప్పటికీ నా దగ్గరనే ఉన్నాయి"

-ప్రియమణి, నటి

'ఫ్యామిలీ మ్యాన్​' వెబ్​సిరీస్​ తొలి సీజన్​తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియమణి.. ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్​ 2' వెబ్​సిరీస్​తో మరోసారి అలరిస్తోంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలో 'విరాటపర్వం'(Virataparvam), 'నారప్ప'(Narappa), 'మైదాన్'​(హిందీ), కన్నడలో 'సైనైడ్'​, 'డాక్టర్​ 56', 'ఖైమారా', కొటేషన్​ గ్యాంగ్​(తమిళం) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది..

మరోవైపు షారుక్​.. 'పఠాన్'​ సినిమాతో బిజీగా ఉన్నారు. కరోనా కారణంగా తాత్కాలికంగా షూటింగ్​ నిలిచిపోయింది. ఇందులో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ తెరపై ఇప్పటివరకూ చూడని యాక్షన్ సీక్వెన్స్​ ఈ చిత్రంలో ఉండనున్నాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ పోరాట సన్నివేశాల కోసం దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. హాలీవుడ్ స్టంట్​ డైరెక్టర్లు కేజీ ఓ నెయిల్, డొమోంకోస్ పర్ణానీలు రంగంలోకి దించారు. 2022లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇదీ చూడండి: క్వారంటైన్​లోకి షారుక్​.. 'పఠాన్'​ షూటింగ్​ వాయిదా!

Last Updated : Jun 17, 2021, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details