తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గ్లోబల్​ ఈవెంట్​లో​ 'డాన్​' జోడి

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఎంతో కృషి చేస్తున్న ఆరోగ్య సిబ్బందిని సన్మానించేందుకు ఓ గ్లోబల్​ ఈవెంట్​ జరగనుంది. ఇందులో బాలీవుడ్​ ప్రముఖులు షారుక్​, ప్రియాంక చోప్రా పాల్గొననున్నారు.

By

Published : Apr 8, 2020, 5:26 AM IST

Shah Rukh, Priyanka part of global event honouring healthcare workers on COVID-19 frontline
గ్లోబల్​ ఈవెంట్​లో​ బాలీవుడ్ స్టార్స్​ షారుక్​, ప్రియాంక చోప్రా

కొవిడ్​-19 మహమ్మారిపై యుద్ధంలో రాత్రి పగలు తేడాలేకుండా కష్టపడుతోన్న ఆరోగ్య సిబ్బందిని సన్మానించేందుకు.. గ్లోబల్​ ఈవెంట్​ను నిర్వహించనున్నారు. పాప్ స్టార్​ లేడీ గాగా నిర్వహిస్తోన్న గ్లోబల్ టెలివిజన్​ అండ్​ స్ట్రీమింగ్​ స్పెషల్​లో బాలీవుడ్​ ప్రముఖులు, డాన్​ జోడీ.. ప్రియాంక చోప్రా, షారుక్​ ఖాన్ పాల్గొననున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ​), అంతర్జాతీయ న్యాయవాద సంస్థ గ్లోబల్ సిటిజెన్​ నిర్వహించిన 'వన్​ వరల్డ్ టుగెదర్​ ఎట్​ హోమ్' కార్యక్రమం ఈనెల 18న ప్రసారం కానుంది. దీని ద్వారా మహమ్మారి నివారణకు తీవ్రంగా శ్రమిస్తున్న వైద్యులు, నర్సులు, కార్మికులు వారి కుటుంబాల నిజ జీవితాలను ప్రదర్శించనున్నారు.

షారుక్​, ప్రియాంకతో పాటు

ఈ ఈవెంట్​లో షారుక్​, ప్రియాంక చోప్రాతో పాటు అలానిస్​ మోరిసెట్​, బిల్లీ ఎలిశ్​, గ్రీన్​ డేకి చెందిన బిల్లీ జో ఆర్మ్​స్ట్రాంగ్​, క్రిస్​ మార్టిన్​, డేవిడ్​ బెక్హాం, ఎల్టన్ జాన్​, ఇడ్రిస్​, సబ్రినా ఎల్బా, జాన్ లెజెండ్​, కెర్రీ వాషింగ్టన్​, లాంగ్​ లాంగ్​, లిజ్జో, పాల్​ మాక్కార్ట్నీ, స్టీవీ వండర్​ ఉండనున్నారు.

'ది టునైట్​ షో' లో

ఈ కార్యక్రమాన్ని ' ది టు నైట్​ షో'కు చెందిన జిమ్మీ ఫాలన్​, 'జిమ్మీ కిమ్మెల్​ లైవ్'​కు చెందిన జిమ్మీ కిమ్మెల్​.. 'ది లేట్​ షో విత్​ స్టీఫెన్​ కోల్బర్ట్'​కు చెందిన స్టీఫెన్​ కోల్బర్ట్​ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రపంచంపై సామాజిక, ఆర్థిక ప్రభావాలను తగ్గించడానికి, భవిష్యత్తులో ప్రపంచ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కలిసి పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని యూఎన్​ సెక్రటరీ తెలిపారు.

”సమాజం ఆరోగ్యం కోసం తీవ్రంగా కృషి చేస్తున్న కార్యకర్తలను గౌరవిస్తూ వారికి మద్దతు ఇస్తున్నాం. కొవిడ్​ -19ను అరికట్టేందుకు ప్రపంచ పోరాటానికి చేయూతనిచ్చి ఐక్యత చాటుదాం.”

-- హ్యూ ఎవాన్స్​, గ్లోబల్ సిటిజన్​ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ

ఆన్​లైన్​లో ప్రసారం

ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అలీబాబా, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు పలు గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆన్‌లైన్‌లో ప్రసారం చేస్తారు.

ఇదీ చదవండి:కరోనా తీవ్రత తగ్గిన వెంటనే #ప్రభాస్20 అప్​డేట్స్

ABOUT THE AUTHOR

...view details