బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు 'సంకీ' అనే పేరు పెట్టినట్లు వార్తలు వినిపించాయి. దీనిపై కింగ్ ఖాన్ పుట్టినరోజైన నవంబర్ 2న చిత్రబృందం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఈ చిత్రంలో షారుక్ సరసన ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇటీవలే నిర్మాతలు ఆమెకు కథ వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.