తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బేతాళుడిని సృష్టించే పనిలో కింగ్​ ఖాన్​! - horror series

షారుఖ్​ నిర్మాణంలో ఓ వెబ్​సిరీస్​ రాబోతుంది. నెట్​ఫ్లిక్స్​ భాగస్వామ్యంలో 'బేతాళ్' పేరుతో పట్టాలెక్కించనున్నాడు కింగ్ ఖాన్​. 'గుల్'​ సిరీస్​తో గుర్తింపు తెచ్చుకున్న పాత్రిక్ గ్రాహమ్ ఈ హర్రర్ సిరీస్​ను తెరకెక్కించనున్నట్టు సమాచారం.

షారుఖ్

By

Published : Jul 16, 2019, 9:35 AM IST

వెండితెరపై హీరోగా, నిర్మాతగా సత్తా చాటి బాలీవుడ్​ బాద్​షాగా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ డిజిటల్​ ఫ్లాట్​ఫామ్​లోనూ జోరు పెంచాడు. నెట్​ఫ్లిక్స్​ భాగస్వామ్యంలో ఓ హర్రర్ సిరీస్​ను నిర్మించనున్నాడు. 'బేతాళ్' పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్​సిరీస్​కు పాత్రిక్​ గ్రాహమ్ దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం. ఇంతకుముందు రాధికా ఆప్టేతో కలిసి 'గుల్' అనే వెబ్​సిరీస్​ను తెరకెక్కించాడీ దర్శకుడు.

వినీత్ కుమార్ సింగ్, అహానా కుమ్రా తదితరులు ఇందులో నటించనున్నారు. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఇది షారుఖ్ రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై నెట్​ఫ్లిక్స్​లో రాబోతున్న మూడో వెబ్​సిరీస్​.

ఇప్పటికే ఈ బ్యానర్లో ఇమ్రాన్ హష్మి నటించిన 'బార్డ్ ఆఫ్ బ్లడ్'​, బాబీ దేఓల్​ ప్రధాన పాత్రలో 'క్లాస్ ఆఫ్ 83' చిత్రాలు రూపొందాయి. త్వరలో ఇవి డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇది చదవండి: లేడీ మైకేల్ జాక్సన్​.. కిర్రాక్ కత్రినా

ABOUT THE AUTHOR

...view details