తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శారద మరణించినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు.. అసలేమైంది? - నటి శారద మృతిపై అంచనాలు

విభిన్న భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన కథానాయిక, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ శారద.. మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో నిజమెంత?

sharada
శారద

By

Published : Aug 8, 2021, 6:05 PM IST

Updated : Aug 8, 2021, 6:53 PM IST

అలనాటి దిగ్గజ నటి, ఊర్వశి శారద కన్నుమూశారంటూ ఆదివారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలోని నటీనటులతో పాటు, ఆమె అభిమానులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఆ వార్తలు నిజమా? కాదా? అన్న దానిపై స్పష్టత కోసం వేచి చూశారు. విషయం తెలుసుకున్న శారద సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు.

ఆ వార్తలు బాధాకరం..

"నేను బతికే ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. కాకపోతే ఒంట్లో కాస్త నలతగా ఉంది. దయచేసి వాట్సాప్‌లలో వచ్చే వాటిని నమ్మకండి. ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఆందోళన చెందుతున్నారు. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వ్యాప్తి చేయటం బాధాకరం"అని పేర్కొన్నారు.

తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయిక, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శారద తనదైన ముద్రవేశారు. ఆమె మూడుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 76 సంవత్సరాలు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇదీ చదవండి:RRR movie: ఎన్టీఆర్​కు ఏమైంది..​ 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్​ క్లారిటీ

Last Updated : Aug 8, 2021, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details